రికార్డులు తిరగరాస్తున్న ‘జై లవ కుశ’

Published : Sep 12, 2017, 03:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
రికార్డులు తిరగరాస్తున్న ‘జై లవ కుశ’

సారాంశం

‘జై లవ కుశ’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కోటి దాటిని ట్రైలర్ వ్యూస్ రికార్డులు తిరగరాస్తున్న జై లవ కుశ

ఎన్టీఆర్ కథానాయకుడిగా విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘జైలవకుశ’. ఈ సినిమాలో తారక్.. తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి చిత్రంపై భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్ చేసిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

 

మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ వైవిధ్యం కనపరుస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిమానులతో పాటు  సినీ ప్రముఖులు కూడా ట్రైలర్ బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అయితే.. ట్రైలర్ ని విడుదల  చేసిన  24గంటల్లో ...7మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పుడు.. ఈ ట్రైలర్ ని వీక్షించిన వారి సంఖ్య కోటి దాటింది. అతి తక్కువ సమయంలో ఇంత మంది ట్రైలర్ ని వీక్షించడం బాహుబలి తర్వాత జైలవకుశకే దక్కింది.

 

ఈ ట్రైలర్ తో పలు సినిమాల రికార్డులను తిరగరాసాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఇందులో జై పాత్ర మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?