రిసెప్షన్ ఏర్పాట్లలో బిజీబిజీ గా అక్కినేని కుటుంబం

Published : Sep 12, 2017, 03:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
రిసెప్షన్ ఏర్పాట్లలో బిజీబిజీ గా అక్కినేని కుటుంబం

సారాంశం

అక్టోబర్ 6న చైతు, సమంతల వివాహం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ పెళ్లి పనుల్లో బిజీ గా అక్కినేని కుటుంబం

అక్కినేని కుటుంబం అంతా బిజీబిజీగా గడిపేస్తోంది. ఒక వైపు సినిమా షూటింగ్ లు, మరోవైపు చైతన్య, సమంత పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. టాలీవుడ్ ప్రేమ జంట.. నాగ చైతన్య, సమంతల పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నారన్న విషయం తెలిసిందే.

 

అయితే..వారి వివాహం మరెంతో దూరంలో లేదు. అక్టోబర్ 6వ తేదీన అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిపిస్తున్నారు. రెండు సంప్రదాయాల్లో ఈ వివాహం జరిపిస్తుండగా..రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అక్టోబర్ 10వ తేదీనే సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించి రిసెప్షన్ నిర్వహించాలనేది నాగార్జున  ఆలోచన.

 

పెళ్లికి, రిసెప్షన్ మధ్య గ్యాప్ కూడా పెద్దగా లేదు. ఈ పెళ్లికి ముందుగానే నాగచైతన్య, సమంతలు తాము అంగీకరించిన సినిమాల షూటింగ్ పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ పనులు ఎక్కడికక్కడే పడి ఉన్నాయట. దీంతో ఒక వైపు షూటింగ్ లకు హాజరౌతూనే నాగ్, చైతు, సమంతలు పెళ్లి పనులు చక్కపెట్టుకుంటున్నారట.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు