చంద్రబాబు నవ్వితే చూడాలనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ

Published : Jul 03, 2017, 04:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
చంద్రబాబు నవ్వితే చూడాలనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ

సారాంశం

గత కొంత కాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్వులేని నాయకుడన్న వర్మ

వివాదాలకు దూరంగా వుంటానని తేల్చిచెప్పిన రామ్ గోపాల్ వర్మ తను సంచలన దర్శకుడినని మరోసారి నిరూపించుకున్నారు. వివాదాస్పద ట్వీట్లు చేసి మీడియాలో నానే వర్మ తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వివాదాలంటేనే వర్మ.. వర్మ అంటేనే వివాదం అని మరోసారి నిరూపించాడు. వర్మ తాజాగా మరోసారి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

 

ఈసారి వర్మ టార్గెట్ చేసిన వారిలో సినీ ప్రముఖులే కాక కీలక రాజకీయ నేతలను టార్గెట్ చేశాడు. వివాదాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టిస్తాయోననే చర్చ సాగుతోంది. వర్మ కొంతకాలం వరకు తన నోటికి తాళం వేసుకొన్నా.. తాజాగా ఆయన మరోసారి రాజకీయనాయకులు,, సినీ ప్రముఖుల గురించి వ్యాఖ్యలు చేశాడు. పలువురు రాజకీయనేతలు, సినీ ప్రముఖులపై తన అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశాడు.

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నవ్వులేని నాయకుడిగా పోల్చాడు. విపక్ష నేత వైఎస్ జగన్ ను సన్ ఇన్ ఇనుము (ఐరన్) తో పోల్చాడు. పవన్ కళ్యాణ్ సినీ హీరోగాకన్నా రాజకీయ నేతగానే తాను ఎక్కువ గుర్తిస్తానని అయితే ఆయన విషయంలో ఏం జరగబోతోందనేది వెయిట్ అండ్ వాచ్(వేచి చూడాలని)పేర్కొన్నాడు.

 

ఇక తెలుగు సినీ ప్రముఖుల గురించి మరోసారి తన మనసులోని మాట బయటపెట్టాడు వర్మ. రాజమౌళిని మెస్సయ్య ఆఫ్ ఫిల్మ్స్ అని, ప్రభాస్ ను సెక్సీయెస్ట్ పవర్ అని, జూనియర్ ఎన్టీఆర్ ను రిపీటింగ్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక నాగార్జునను లవ్ అని, చిరంజీవిని స్టార్ మెగా అని, బన్నీని డేంజరస్ రాబిట్ అని, రామ్ చరణ్ ను ధీరుడైన మగాడని, నాగబాబును లవ్ లీ బ్రదర్ అనీ వర్మ ఇలా చాలా మందిపై తన అభిప్రాయం వెల్లడించాడు.

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?