సంఘమిత్రలో శృతిహాసన్ స్థానం ఆక్రమించే పనిలో హాన్సిక

Published : Jul 02, 2017, 07:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సంఘమిత్రలో శృతిహాసన్ స్థానం ఆక్రమించే పనిలో హాన్సిక

సారాంశం

సంఘమిత్ర చిత్రంలోంచి తప్పుకున్న శృతీహాసన్ చారిత్రకంగా తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకుడు సుందర్ సంఘమిత్ర పాత్రలో హాన్సికను తీసుకునే ఆలోచనలో సుందర్

బాహుబలి చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని అదే తరహాలో తమిళంలో సుందర్ దర్శకత్వంలో 'సంఘమిత్ర' అనే భారీ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత శృతి హాసన్ ను అనుకున్నారు. పలు కారణాలతో ఈ సినిమా నుండి శృతి తప్పకుంది. దీంతో సంఘమిత్ర పాత్ర కోసం తమన్నా, అనుష్క, నయనతార తదితర హీరోయిన్ల పేర్లు పరిశీలించారు.

 

తాజాగా ఈ అవకాశం హన్సికకు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇంకా ఫైనల్ కాలేదని చిత్ర యూనిట్ చెబుతున్నమాట. ఇంతకు ముందు ఈ చిత్రానికి అనుష్క, నయనతారల పేర్లు వినిపించాయి. అయితే వారి డేట్స్ ఖాళీ లేక పోవడంతో హన్సిక వైపు దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు టాక్. అయితే హన్సికకు ఈ రోల్ అంతగా సూటవ్వదని, ఆమె కత్తిసాము లాంటి సీరియస్ సీన్స్ లో హాన్సిక ఎంత మేరకు చేయగలదని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

దీంతో దర్శకుడు సుందర్‌.సి హాన్సిక ఈ పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తుందోనని అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. గతంలో సుందర్.సి దర్వకత్వంలో 'అరణ్మనై', 'అరణ్మనై 2' చిత్రాల్లో హన్సిక నటించారు. తేనాండాల్‌ స్టూడియో లిమిటెడ్‌ సంస్థ రూ.300 కోట్లతో 'సంఘమిత్ర'ను ప్లాన్ చేస్తోంది. సుందర్‌.సి దర్శకత్వంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందనుంది.

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?