
రామ్‌చరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒకటై నేటితో ఐదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఉపాసన ట్విటర్‌లో ప్రత్యేక సందేశం రాశారు. తమకు అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ‘మిస్టర్, మిస్సెస్ సీ(చరణ్)కు ఐదేళ్లు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, ఆదరణ లేకపోతే ఈ ప్రయాణం అద్భుతంగా ఉండేది కాదు. మా కోసం ఎప్పుడూ వెన్నంటి ఉన్నందుకు ధన్యవాదాలు’ అని ఉపాసన ట్వీట్ చేశారు. 2012లో రామ్‌చరణ్‌కు, ఉపాసనకు పెళ్లి జరిగింది.
చెర్రీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీనికి ‘రంగస్థలం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సమంత ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.