భరత్ అను నేను.. చిత్రం షూటింగ్ కు వారంలో మహేష్ బాబు

Published : Jun 14, 2017, 08:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
భరత్ అను నేను.. చిత్రం షూటింగ్ కు వారంలో మహేష్ బాబు

సారాంశం

భరత్ అను నేను.. చిత్రం షూటింగ్ కు వారంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహేష్ బాబుతో ఇప్పటికే శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాల

వరుస విజయాలతో కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో 'భరత్ అను నేను' అనే సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే, మురుగదాస్ సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉండటం వలన, మహేశ్ తో సంబంధం లేని సన్నివేశాలను కొరటాల చిత్రీకరిస్తూ వెళుతున్నాడు.

 'స్పైడర్' షూటింగ్ పూర్తి కాగానే ఈ నెల 19 నుంచి కొరటాల షూటింగులో మహేశ్ బాబు జాయిన్ అవుతాడని అంటున్నారు. అప్పటి నుంచి మహేశ్ కాంబినేషన్లోని సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఈ సినిమాలో మహేశ్ సరసన కైరా అద్వాని నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.   

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు