
ఇక సినిమాల్లో నటించనంటూ ఈ రోజు ఉదయం మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశాడు. అంతే, అభిమానుల్లోనూ .. ఇండస్ట్రీలోను అది హాట్ టాపిక్ గా మారిపోయింది. హఠాత్తుగా ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా ఆశ్చర్యపోయారు. అందుకు కారణమేమై ఉంటుందా? అనే ఆలోచనలో పడ్డారు.
అయితే ఆ వెంటనే మనోజ్ ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు. తన కొత్త సినిమా ప్రకటనను సరికొత్తగా చేయడానికి తాను చేసిన ప్రయత్నం ఇలా బెడిసికొట్టిందని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం మరో టాక్ వినిపిస్తోంది. మనోజ్ ట్వీట్ ను సీరియస్ గా తీసుకున్న మోహన్ బాబు ఆయనకి గట్టిగా క్లాస్ పీకారని అంటున్నారు. మంచు లక్ష్మీ .. విష్ణు కూడా ఆయనకి తోడయ్యారట. విషయమేదైనా వుంటే సూటిగా చెప్పేయాలనీ, అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు చేయవద్దని మందలించారట. అందువల్లనే మనోజ్ ఆ ట్వీట్ ను డిలీట్ చేసి, వివరణ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.