ఉపాసనపై తన ప్రేమను పబ్లిగ్గా చాటిన చెర్రీ

Published : Jun 30, 2017, 11:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఉపాసనపై తన ప్రేమను పబ్లిగ్గా చాటిన చెర్రీ

సారాంశం

టాలీవుడ్ దంపతుల్లో యంగ్ హాట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఇరువురికి ఒకరిపట్ల ఒకరికి పరస్పరం విశాలమైన ప్రేమానురాగాలు ఫెమీనా అవార్డు దక్కించుకున్న ఉపాసనను.. ఉప్సీ అంటూ పబ్లిగ్గా అభినందించిన చెర్రీ

టాలీవుడ్ లో రామ్‌చరణ్‌ తేజ్‌,ఉపాసన దంపతులకున్న క్రేజ్ ఏంటో తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా తమ మధ్య వున్న ప్రేమానురాగాలను సోషల్ మీడియాకు ఎక్కిస్తుంటారు. తాజాగా చెర్రీ మరోసారి పబ్లిగ్గా సోషల్ మీడియాలో తన ప్రేమను వ్యక్త పరిచాడు. రామ్ చరణ్ ను.. ఉపాసన 'మిస్టర్‌ సి' అని సోషల్ మీడియాలో పిలుస్తుంటారు. అలాగే చెర్రీ కూడా ఉపాసనను 'ఉప్సీ' అని ముద్దుగా పిలుస్తుంటాడు. ఉపాసనకు తాజాగా ఫెమినా ఉమెన్స్ అవార్డు రావడంతో 'ప్రౌడ్ ఆఫ్ యూ ఉప్సీ' అంటూ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు రామ్ చరణ్.

 

హెల్త్ కేర్ రంగంలో ఆమె చేస్తున్న సేవలకు గాను.. ఫెమినా ఉమన్స్ అవార్డ్స్ 2017లో ఈమెకు ప్రత్యేకంగా అవార్డ్ ఇచ్చారు. ఉపాసన ఈ విషయాన్ని అందరితోను పంచుకోగా.. ఉపాసన-అవార్డు ఫోటోలను కలిపి పోస్ట్ చేసిన రామ్ చరణ్.. 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఉప్సీ' అంటూ తన అభినందనలు తెలిపాడు.

 

ఈ ట్వీట్ కే అభిమానులు మురిసి పోతూంటే దానికి ఉపాసన ఇచ్చిన ఆన్సర్ మరింత క్యూట్ గా కనిపించింది 'థ్యాంక్యూ మై లవ్. నువ్వు.. నీ సపోర్ట్ లేకుండా నేను ఇదంతా సాధించగలిగే దాన్నికాదు' అంటూ ఉపాసన రిప్లై ఇచ్చింది. భార్యా భర్తలు ఇద్దరూ ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే కాదు.. దాన్ని ఇంత పబ్లిక్ గా ప్రదర్శించడం కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి.

 

అంతేకాదు.. చెర్రీ తన భార్య మీద ప్రేమని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. UPSI అనే అక్షరాలతో చరణ్ చేతి మీద గోరింటాకుతో రాసిన టాటూ అందరి దృష్టినీ ఆకర్షించింది. తనంటే చరణ్ కి ఎంత ప్రేమ ఉండి ఊహించుకోవచ్చు. నిజానికి మొదట్లో ఈ ఇద్దరూ ఎక్కువగా బయటకనిపించలేదు. కానీ ఇటీవల కాస్త బిడియం తగ్గినట్టు కనిపిస్తున్నారు చెర్రీ ఉపాసన జంట.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన