వచ్చే వారం నుంచి థియేటర్లలో ‘ధృవ’ టీజర్

Published : Oct 26, 2016, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
వచ్చే వారం నుంచి థియేటర్లలో ‘ధృవ’ టీజర్

సారాంశం

థియేటర్లలోకి దూసుకొచ్చేస్తున్న రామ్ చరణ్ ధృవ టీజర్ వచ్చే వారం నుంచి థియేటర్లలో ప్లే చేయనున్న టీమ్ ఇప్పటికే ధృవ టీజర్ కు ఆన్ లైన్ లో పిచ్చి రెస్పాన్స్

ధృవ టీమ్ కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాను పక్కాగా డిసెంబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కష్టపడుతోంది. అదేవిధంగా ఇప్పట్నుంచే ప్రమోషన్స్‌ కూడా మొదలుపెట్టేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాలను తారాస్థాయికి చేర్చగా, త్వరలోనే ఆడియో, ట్రైలర్‌లను కూడా విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 35 లక్షలకు పైనే వ్యూస్ సాధించిన ఫస్ట్ టీజర్‌ను వచ్చే వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారట. దీంతో యూట్యూబ్‌లో సందడి చేసిన టీజర్, ఇప్పుడు థియేటర్లలోనూ మెప్పించనుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ అయిన ఈ పోలీస్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూండగా, గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్టోంది. ఈ మూవీలో అలనాటి ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్‍గా కనిపించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Salman Khan: సల్మాన్ ఖాన్ అంటే అస్సలు పడని హీరోయిన్లు, సెలబ్రిటీలు వీళ్ళే
Dhurandhar OTT: ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర.. పుష్ప 2 రికార్డుని బద్దలు కొడుతూ వందల కోట్లతో ఓటీటీ డీల్