మరోసారి పొలిటీషియన్ అవతారంలో కేథరిన్

Published : Oct 25, 2016, 11:16 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
మరోసారి పొలిటీషియన్ అవతారంలో కేథరిన్

సారాంశం

పొలిటికల్ లీడర్ పాత్రలో దుమ్ములేపిన కేథరిన్ రేసుగుర్రంలో ఎమ్మల్యే పాత్రకు సూపర్ రెస్పాన్స్ చిరుతో సాంగ్ చేసే అవకాశం చేజార్జుకున్న కేథరిన్ మరో పొలిటికల్ లీడర్ రోల్ రావడంతో సంతోషంలో కేథరిన్

అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలో యువతరం ఎమ్మెల్యేగా చక్కటి నటనను ప్రదర్శించింది మంచి మార్కులు కొట్టేసింది కేథరిన్. ఈ సినిమాతో తెలుగులో కమర్షియల్ సక్సెస్‌ను సొంతం చేసుకుందీ భామ. ఈమె మరోసారి రాజకీయ నాయకురాలి పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్‌తో పాటు కేథరిన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ధనవంతురాలైన పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.

          ఈ మూవీలో కేథరిన్ పాత్ర చాలా శక్తివంతంగా సాగుతుందని తెలిసింది. రాజకీయాలతో ముడిపడి ఉన్న పాత్రలో మరోసారి కనిపించనుండటం ఆనందంగా ఉందని, ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందనే నమ్మకముందని కేథరిన్ సంబుర పడుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నేనే రాజు నేనే మంత్రి అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.

          మొత్తానికి మెగాస్టార్ చిరుతో స్టెప్పులేసే అద్భుత అవకాశం మిస్సయినా... తనకు మంచి గుర్తింపునిచ్చిన  పొలిటికల్ లీడర్ రోల్ మరోసారి దొరకటం కేథరిన్ కు ఆనందాన్నిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం