అక్టోబర్ 28న కార్తీ ‘కాష్మోరా’ మూవీ రిలీజ్

Published : Oct 26, 2016, 04:26 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అక్టోబర్ 28న కార్తీ ‘కాష్మోరా’ మూవీ రిలీజ్

సారాంశం

అక్టోబర్ 28న కార్తీ కాష్మోరా మూవీ రిలీజ్ కాష్మోరాలో కార్తీ ద్విపాత్రాభినయం 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కాష్మోరా  

60 కోట్ల భారీ బడ్జెట్ తో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ లు తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైపోయింది. రెండు భాషల్లో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా సుమారు 1700 థియేటర్లలో కాష్మోరా విడుదలవుతుండటం విశేషం.

కార్తీ కెరీర్‌ లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్‌. యూఎస్‌లోనూ 150కి పైనే థియేటర్లలోనూ, ప్రపంచవ్యాప్తంగా... 1000 పైగా థియేటర్లలోనూ ఈ సినిమా విడుదలవుతోంది. ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కార్తీ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. పీవీపీ సినిమా తెలుగులో విడుదల చేస్తోన్న కాష్మోరా మూవీలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం