చిరంజీవికి పద్మవిభూషణ్‌పై ఆర్జీవీ సెటైర్లు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

Published : Feb 19, 2024, 10:03 AM IST
చిరంజీవికి పద్మవిభూషణ్‌పై ఆర్జీవీ సెటైర్లు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

సారాంశం

చిరంజీవికి పద్మ విభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంగా వర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌ అయ్యింది. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తాను హర్ట్ అయినట్టు చెప్పాడు. 

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత రెండో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం `పద్మ విభూషణ్‌`ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సినీ, రాజకీయ, వ్యాపార, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టాయి. ఏకంగా పార్టీ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దీనిపై స్పందిస్తూ చిరంజీవిపై సెటైర్లు పేల్చారు. తనదైన స్టయిల్‌లో ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. 

`శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం, శ్రీ బిందేశ్వర్‌ పాఠక్‌ల గురించి నేను ఎప్పుడూ వినలేదు. వారిని మెగాస్టార్‌తో సమానమైన స్థితిలో ఉంచడంతో పద్మవిభూషణ్‌ పురస్కారం విషయంలో నేఉన థ్రిల్‌ని పొందలేకపోతున్నా. ఒకవేళ చిరంజీవిగారు సంతోషంగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తా` అని వెల్లడించారు వర్మ. ఇది కాస్త వైరల్‌ అయ్యింది. వర్మ విచిత్రంగా కామెంట్లు చేయడం కామనే, కానీ దీనిపై ఆయన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తన ఉద్దేశ్యంలో చిరంజీవితో పోల్చితే మిగిలిన ఇద్దరు సమానం కాదు అని, ఆ స్థాయి వ్యక్తులు కాదు అని, అలాంటి వారికి సమానంగా చిరంజీవిని ఎలా చూస్తారని, అలా చేస్తే అది చిరంజీవి స్థాయి తగ్గించినట్టే అవుతుందని ఆయన వెల్లడించారు. వాళ్లు అంతటి పాపులరో కాదో నాకు తెలియదు, నా దృష్టిలో మెగాస్టార్‌ అంతటి గొప్ప స్థాయిలో ఉన్నారు, మిగిలిన ఇద్దరు అంతటి పాపులర్‌ వ్యక్తులు కాదు కాబట్టి చిరంజీవిని తగ్గించినట్టు అవుతుందని కదా అని వెల్లడించారు. ఒక మెగాస్టార్‌ అభిమానిగా అది తనకు నచ్చలేదని, అందుకే ఆ పోస్ట్ పెట్టినట్టు తెలిపారు వర్మ. 

ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాల నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, కుట్రలు, ఎత్తుగడల నేపథ్యంలో `వ్యూహం` అనే సినిమాని తెరకెక్కించారు. ఇది ఈ నెల 23న విడుదల కాబోతుంది. దీనికి పార్ట్ 2 `శపథం` మార్చి 1న రిలీజ్‌ కానుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కి పాజిటివ్‌గా చూపిస్తూ, చంద్రబాబు, పవన్‌లకు నెగటివ్‌గా చూపిస్తూ ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. 

Read more: `Kalki2898AD`లో ఎన్టీఆర్‌.. మతిపోయే విషయాలను వెల్లడించిన రైటర్‌.. నిజంగా ఇది అరాచకమే!

Also read: Chiranjeevi: అమెరికా వెళ్లి చిరంజీవికి 100 కోట్లు ఆఫర్.. ఫ్లాప్ చిత్రాల నిర్మాతని చూసి అంతా షాక్ ?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు