#Matka: ‘మట్కా’ ఆగిపోయిందా?.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

Published : Feb 19, 2024, 07:10 AM IST
#Matka: ‘మట్కా’ ఆగిపోయిందా?.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

సారాంశం

  1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. 

 వరుణ్ తేజ్ తొలిసారి పాన్ ఇండియా హీరోగా రాబోతున్న మట్కా చిత్రం ఆగిపోయింది అంటూ గత కొద్ది రోజులుగా  వార్తలు వైరల్ అవతున్నాయి. అందుకు కారణంగా బడ్జెట్ ఎక్కువ అవుతోందని, వరుణ్ తేజ్ కు వరస ప్లాఫ్ లు రావటంతో  మాత్రం ఏ వర్కవుట్ కావటం లేదని ఆపేసారని అంటున్నారు. అయితే అందులో నిజమెంత అని చూస్తే...అసలు అవన్నీ ఫేక్ రూమర్స్ అని తేలింది. ఈ రూమర్స్ పుట్టడానికి కారణం  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  గత కొంతకాలంగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో బిజీగా ఉండటమే.   తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ నిజానికి ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవ్వడం కారణంగా మార్చి 1కి విడుదల కానుంది.  ఈ క్రమంలో మట్కా చిత్రం షూటింగ్ అప్డేట్స్ రాలేదు. మీడియాకు మొత్తం ఆపరేషన్ వాలెంటైన్ గురించిన వార్తలే ఇస్తున్నారు. దాంతో మట్కా ఆగిపోయిందని  ఈ వార్తలు మొదలయ్యాయి. 

వరుణ్ తేజ్ ఈ వార్తలును కొట్టి పారేస్తూ...“ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 35 రోజులు ఆల్రెడీ పూర్తైంది. రామ్ తాళ్లూరి గారు నాకు క్లోజ్. ఆయన ప్రొడక్షన్ లో పార్టనర్ గా జాయిన్ అ్యయారు. ఒక్కసారి  ఆపరేషన్ వాలెంటైన్  ప్రమోషన్స్ పూర్తైతే...మట్కా షూటింగ్ మళ్లీ మొదలు అవుతుంది. అంతేకానీ మట్కా కు ఓవర్ బడ్జెట్ అయ్యిందనో లేదో సినిమా ఆపేసో ప్రక్కన పెట్టలేదు ”,అని మీడియాకు క్లారిటీ ఇచ్చారు వరుణ్ తేజ్.  

‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌ (Karuna Kumar)తో కలిసి వరుణ్ తేజ్ చేస్తున్న  తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ (Matka). త్వరలోనే  రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Vyra Entertainments)పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న   1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మించారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయని.. నలుగురు ఫైట్ మాస్టర్‌లు యాక్షన్‌ని పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.  

 24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ (Varun Tej) నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు.  వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి (Nora Fatehi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 5: కూతురిని గెంటేసిన వేదవతి, చనిపోవడానికి సిద్ధమైన అమూల్య
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి గుండెపోటు, మనోజ్ ఆత్మహత్య.. మరో ఉత్తరం కలకలం