`కల్కి2898ఏడీ`లో ఎన్టీఆర్ గెస్ట్.. మతిపోయే విషయాలను వెల్లడించిన రైటర్.. నిజంగా ఇది అరాచకమే!
ప్రభాస్ నటిస్తున్న `కల్కి` సినిమాకి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త మాత్రం ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది.
ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న సినిమా ఏదైనా ఉందంటే `కల్కి2898ఏడీ`. చూడబోతుంటే ఈ మూవీ ఇండియన్‌సినిమాకి గేమ్ చేంజర్‌లా కనిపిస్తుంది. సినిమా కానీ పెద్ద హిట్ అయితే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అయిపోతాయి. `బాహుబలి 2` రికార్డులు బ్రేక్ అవుతాయి. అదే సమయంలో భారతీయ సినిమా రూపురేఖలను మార్చేసే మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ఇందులో ఇప్పటికే భారీ కాస్టింగ్ యాడ్ అయ్యింది. ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటానీ మెయిన్ కాస్టింగ్‌గా ఉన్నారు. వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, మృణాల్ ఠాకూర్‌తోపాటు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, వంటి మరికొంత మంది పాపులర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. కాస్టింగ్ వైజ్‌గా ఇప్పటికే ఇది అతి పెద్ద మూవీగా నిలిచింది. దీంతో దీనికి మించిన ఓ క్రేజీ వార్త, ఇంకా చెప్పాలంటే పూనకాలు తెప్పించే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా చిన్న కొమియో పాత్రలో కనిపిస్తారట. కాసేపు అలా తళుక్కున మెరుస్తారని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయాన్ని ఈ మూవీకి స్క్రిప్ట్ రైటింగ్‌లో పనిచేస్తున్న(ఫ్రీలాన్స్ రైటర్) కేశవ చంద్ర హింట్ ఇవ్వడం విశేషం. ఆయన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించారు. వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
`కల్కి`లో ఎన్టీఆర్ కొమియో వార్తలపై సమాధానం చెప్పాలని వాళ్లు అడగ్గా ఆ విషయాన్ని మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి అని చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించిన క్రేజీ విషయాలను వెల్లడించారు. ఈ మూవీలో మైథలాజికల్ ఎలిమెంట్లు ఉంటాయని, రామాయణం, మహాభారతానికి సంబంధించిన అంశాలు ఉంటాయని తెలిపారు. చాలా కాలంగా ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. పురాణాల నేపథ్యంలోనే సినిమా సాగుతుందని తెలిపారు. విష్ణుమూర్తి అవతారమే కల్కి అని, విష్ణు పదోవ అవతారమే కల్కి అని, అలాంటప్పుడు విష్ణుమూర్తి ప్రస్తావన కూడా ఉంటుందని తెలిపారు. ఈ లెక్కన ప్రభాస్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు రైటర్.
Kalki 2898 AD
అయితే సినిమాకి సంబంధించిన క్రియేటివ్ వర్క్ విషయంలో నిర్మాతతో గొడవపడ్డామని, దీంతో సినిమా గురించి ఎక్కువగా పంచుకోలేనని తెలిపారు. సినిమా సక్సెస్ తర్వాతే మాట్లాడతానని తెలిపారు. కానీ సినిమా స్క్రిప్ట్ పరంగా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, ఇక మూవీ ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని సెట్ చేసేలా ఉంటుందని ఆయన వెల్లడించారు. సినిమాలోకి కమల్ హాసన్ వచ్చారంటే మూవీ లెవల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అని ఆయన పరోక్షంగా వెల్లడించారు.
ఈ మూవీకి సంబంధించిన ఓ డైలాగ్‌ని లీక్ చేశారు. `నాకు నేను ఏమీ కాదు, అస్సలు ఏమీ కాదు (me ? i am nothing, nothing at all) అనే డైలాగ్‌ని తెలిపారు. అయితే ఈ డైలాగ్‌ని అలానే సినిమాలో వాడారో లేదో తెలియదు అని పేర్కొన్నారు. సినిమాలో ఏడు చిరంజీవులు ఉంటారా అనే ప్రశ్నకి, హిందూ పురాణాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉంటారు.ఇందులో అవి చూపించారా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు.
Kalki 2898 AD
సినిమాకి `ప్రాజెక్ట్ కే`నే సరైన టైటిల్ అనిపించిందని, కానీ మేకర్స్ మార్చినట్టు తెలిపారు. అదే సమయంలో ఈ సినిమా నుంచి చాలా భాగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మూడో పార్ట్ పై ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఇలా సినిమాకి సంబంధించిన గూస్ బంమ్స్ అప్‌డేట్స్ ఇచ్చారు. అయితే ఈ అకౌంట్ రియల్ కాదని, ఫేక్ అకౌంట్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్తలు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయని చెప్పొచ్చు. అదే సమయంలో ఎన్టీఆర్, ప్రభాస్ కలిసి కనిపిస్తే వెండితెర చిరిగిపోవాల్సిందే అని, ఇది మామూలు ఆరాచకం కాదని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్‌ని జరుపుకుంటోంది. ఆర్‌ఎఫ్‌సీలో షూట్ చేస్తున్నారట. ప్రభాస్, దిశా పటానీలపై ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీకి సుమారు ఐదు వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయట. ప్రముఖ హాలీవుడ్ మూవీ `డ్యూనే`కి వర్క్ చేసిన కంపెనీ కూడా వీఎఫ్‌ఎక్స్ చేస్తుందని తెలుస్తుంది. ఇవన్నీ సినిమాపై పూనకాలు తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు.
ఇక ఇప్పటికే బిజినెస్ లెక్కలు ప్రారంభమయ్యాయి. నైజాంలో 75కోట్లకి బిజినెస్ జరిగిందని, ఓవర్సీస్ 100కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. హిందీ రైట్స్ కోసం 135కోట్లని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. ఏపీలోనూ వంద కోట్లకుపైగా బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. తమిళం, కన్నడ, మలయాళం కలుపుకుని మరో వంద కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా రిలీజ్‌కి ముందే ఈ మూవీ ఐదు వందల కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మరో రెండు వందల కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. దీంతో ఇది బిగ్గెస్ట్ ప్రాఫిట్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది. ఇక కలెక్షన్ల పరంగా మాత్రం ఇది ఈజీగా ఇది 2000కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు.