Pushpa Movie: అల్లు అర్జున్ కష్టం అసమానమైనది.. పుష్ప రిలీజ్ సందర్భంగా రాంచరణ్ విషెస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 17, 2021, 10:27 AM IST
Pushpa Movie: అల్లు అర్జున్ కష్టం అసమానమైనది.. పుష్ప రిలీజ్ సందర్భంగా రాంచరణ్ విషెస్

సారాంశం

సుకుమార్ సినిమాలన్నీ విభిన్నంగా ఉంటాయి. Pushpa చిత్రంలో సుకుమార్ అల్లు అర్జున్ ని వెరైటీ గెటప్ లో ప్రజెంట్ చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ లో బన్నీ యాటిట్యూడ్  ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఈ చిత్ర కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది.

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో Pushpaపై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ గెటప్, యాటిట్యూడ్ ఈ చిత్రంలో విభిన్నంగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ ఈ  చిత్రం కోసం ప్రాణం పెట్టేశారు. పుష్ప ఒక్క చిత్రం నాలుగు సినిమాలు కష్టంతో సమానం అని అల్లు అర్జున్ అభివర్ణించాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

సుకుమార్ సినిమాలన్నీ విభిన్నంగా ఉంటాయి. Pushpa చిత్రంలో సుకుమార్ అల్లు అర్జున్ ని వెరైటీ గెటప్ లో ప్రజెంట్ చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ లో బన్నీ యాటిట్యూడ్  ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఈ చిత్ర కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది. దీనితో సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది. నేడు పుష్ప ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. 

 

సెలెబ్రిటీల నుంచి అల్లు అర్జున్ కి, పుష్ప చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుష్ప రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలిపాడు. 'పుష్ప చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ తో అసమానమైనది. సుకుమార్ గారి విజన్ ఎప్పుడూ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. రష్మిక తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని రాంచరణ్ ట్వీట్ చేశాడు. 

చరణ్ ట్వీట్ కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. ' నీ ప్రేమ పూర్వక శుభాకాంక్షలకు థ్యాంక్యూ చరణ్. నీవు త్వరలోనే ఈ చిత్రం చూస్తావని అనుకుంటున్నా. నీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నా' అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. 

Also Read: Pushpa Movie Review: 'పుష్ప' ప్రీమియర్ షో టాక్.. ఫారెస్ట్ లో అల్లు అర్జున్ చెడుగుడు

Also Read: Pushpa Review:అల్లు అర్జున్‌ ‘పుష్ప - ది రైజ్‌’ రివ్యూ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ