గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు సుకుమార్ పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆయన సినిమా ఫైనల్ కాపీని రెడీ చేయడంలోనే బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ఆ పని పూర్తి కావడంతో హైదరాబాద్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) నుంచి వస్తోన్న మరో సినిమా `పుష్ప`(Pushpa). `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కొంత గ్యాప్‌తో ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం, డిసెంబర్ 17న) విడుదల కాబోతుంది. యూఎస్‌లో ప్రీమియర్స్ మోత మోగుతుంది. మరోవైపు ఏపీలో షోల ఇష్యూ నడుస్తుంది. ఏపీలోని సీడెడ్‌లో బెనిఫిట్ షోలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఐదు షోలు రద్దు, టికెట్లు పెంచుకోవడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిన నేపథ్యంలో హైకోర్ట్ దానిపై స్టే విధించిన విషయం తెలిసిందే. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో `పుష్ప` సినిమాపై ఆ ప్రభావం చాలా పడబోతుందని తెలుస్తుంది. కలెక్షన్లకి గండి కొట్టేలా ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు Sukumar పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆయన సినిమా ఫైనల్ కాపీని రెడీ చేయడంలోనే బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ఆ పని పూర్తి కావడంతో హైదరాబాద్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడినట్టు చెప్పారు. తాను ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదని, నిద్రలేకపోవడం వల్ల తాను కాన్షియస్‌లో లేనని చెప్పారు. పలు మీడియా ప్రశ్నలకు కూడా ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో దర్శకుడు సుకుమార్ ఎంతటి ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 17న ఎట్టకేలకు తీసుకురావడం కోసం ఆయన నిద్రహారాలు మాని శ్రమించారు. అయితే ఆ ఫలితం రేపు థియేటర్లో కనిపిస్తుందని, ఓ అద్బుతాన్నిసృష్టించామని దర్శకుడు సుకుమార్ చెప్పడం విశేషం.
undefined
అంతేకాదు ఈ సందర్బంగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు. `పుష్ప` బిగినింగ్‌లో కెమెరామెన్‌కి, తనకు మధ్య జరిగి ఓ పెద్ద గొడవని తెలిపారు. `పుష్ప` సినిమాకి పోలాండ్‌కి చెందిన పాపులర్ కెమెరామెన్ కుబా(మిరోస్లా కుబా బ్రోజెక్) సినిమాకి కెమెరా వర్క్ ని చూసుకున్నారు. అయితే కెమెరామెన్ పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. పైగా ఆయన ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్స్ లో చదువుకున్నారు. మంచి పరిజ్ఞానం ఉంది. కానీ ఆయన ఇంగ్లీష్ సుకుమార్ కి అర్థం కావడం లేదట. ఈ మిస్ అండర్స్టాండింగ్ పెద్ద గొడవకి దారితీసిందని, సుకుమార్ ఫైర్ అవ్వడంతో ఏకంగా ఆ సినిమాటోగ్రాఫర్ కన్నీళ్లు పెట్టుకున్నంత పనైందని తెలిపారు సుకుమార్.
సినిమా ప్రారంభంలో కెమెరా లెన్స్ లు ఛేంజ్ చేయాలని తెలిపారట దర్శకుడు సుకుమార్. ఆ సీన్ గురించి వివరించి ఛేంజ్ లెన్స్ అన్నారట సినిమాటోగ్రాఫర్‌తో. దానికి కుబా రియాక్ట్ అవుతూ చెంజ్లెన్స్ ని పాష్‌గా అనడంతో సుకుమార్‌కి అది సెన్స్‌లెస్‌గా వినిపిస్తుందట. మొదటిసారి ఏదో అనుకుని వదిలేశారు. ఆ తర్వాత ఛేంజ్ లెన్స్ అని సుకుమార్ చెబుతుంటే, అతను పదేపదే ఛేంజ్ లెన్స్ (లెన్స్ ఛేంజ్ చేయాలా) అని అంటుంటే తనకు మాత్రం సెన్స్ లెస్‌గా వినిపిస్తుందట. దీంతో అక్కడే కెమెరామెన్ కుబాపై సుకుమార్ ఫైర్ అయ్యారట. `నేను ఎవరో తెలుసా? నేను ఎంత పెద్ద డైరెక్టర్ నో తెలుసా? నా సినిమాలు చూశావా? నేను ఎలాంటి సినిమాలు చేస్తానో తెలుసా? అంటూ తన గురించి చెబుతూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట. డైరెక్టర్ చెబుతుంటే సెన్స్ లెస్ అంటావా అంటూ మండిపడ్డారు.
దీంతో కుబా కళ్లల్లో నీళ్లు తిరిగాయట కాసేపు వాదించి వెళ్లిపోయారట. ఆ తర్వాత సుకుమార్ కార్వాన్ వద్దకి వచ్చి తన బాధని వ్యక్తం చేశాడట. తాను దర్శకుడినే నమ్ముతానని, రెస్పెక్ట్ ఇస్తాతని, తాను చెబుతున్నా మీనింగ్ ఇదని వివరించాడట. అప్పుడుగానీ ఆయన ఇంగ్లీష్ మీనింగ్ అర్థం కాలేదట సుకుమార్. ఆ తర్వాత విషయం తెలిసి నవ్వుకున్నారట. కానీ ఇద్దరి మధ్యగొడవ పెద్దగానే జరిగిందని చెప్పాడు సుకుమార్. ఈ సన్నివేశం అందరికి నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా కుబా వర్క్ ని ప్రశంసించాడు దర్శకుడు. ఆ వర్క్ తెరపై కనిపిస్తుందన్నారు.