Allu Arjun-Pushpa: కేరళలో పుష్పకు భారీ షాక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Published : Dec 17, 2021, 08:23 AM ISTUpdated : Dec 17, 2021, 08:29 AM IST
Allu Arjun-Pushpa: కేరళలో పుష్పకు భారీ షాక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

సారాంశం

పుష్ప (Pushpa) మూవీ విషయంలో అడుగడుగునా మేకర్స్ అలసత్వం కనిపిస్తుంది. ప్రమోషన్స్ లో ఘోరంగా విఫలమైన పుష్ప టీమ్.. మరొక చర్యతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.   

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీతో తమ హీరో దేశవ్యాప్తంగా పాపులర్ కావాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రణాళికలు మాత్రం సరిగా లేవు. పుష్ప మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పూర్తిగా విఫలం చెందారు. తెలుగు వర్షన్ మినహాయిస్తే.. ఇతర భాషల్లో కనీస ప్రచారం చేయలేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప ప్రమోషన్స్ ఘోరంగా ఉన్నాయి. 

ఏదో హడావిడిగా రిలీజ్ కి ఒక్కరోజు ముందు డిసెంబర్ 16న అల్లు అర్జున్, రష్మిక మందాన ముంబైలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమోషన్స్ లేని కారణంగా పుష్ప హిందీ వెర్షన్ ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. కనీసం కోటి రూపాయలు కూడా పుష్ప హిందీ వెర్షన్ కి ఓపెనింగ్స్ ద్వారా వచ్చే పరిస్థితి లేదని, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

కన్నడ, మలయాళ, తమిళ్ వర్షన్స్  విషయంలో కూడా పరిస్థితి అలానే ఉంది. స్టార్ హీరో మూవీ అయినప్పటికీ సరైన ప్రమోషన్స్ నిర్వహించకపోతే... స్థానికంగానే పూర్తి స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం కష్టం. అలాంటిది పుష్ప మేకర్స్ ఇతర భాషల్లో సందడి చేయకుండా.. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాలనుకోవడం అవివేకమే అవుతుంది. 

పుష్ప మేకర్స్ మరో బ్లండర్ మిస్టేక్ ఖాతాలో వేసుకున్నారు. పుష్ప మలయాళ వెర్షన్ ప్రింట్ సిద్ధం కాలేదు. దీనితో అన్ని భాషల్లో పుష్ప నేడు( డిసెంబర్ 17)న విడుదల అవుతుండగా... మళయాళంలో వాయిదా పడింది. రేపు (డిసెంబర్ 18)కేరళలో మలయాళ వెర్షన్ విడుదల కానుంది. తెలుగు తర్వాత అల్లు అర్జున్ కి కేరళలో అతిపెద్ద మార్కెట్ ఉండగా... మలయాళ వెర్షన్ సకాలంలో విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీని కారణంగా కేరళలో పుష్ప ఓపెనింగ్స్ కోల్పోయింది. మళయాళ వెర్షన్ సిద్ధంగా లేని పక్షంలో అక్కడ తమిళ వెర్షన్ విడుదల చేశారు. ఒకవేళ పుష్ప మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న పక్షంలో కేరళలో పుష్ప టీమ్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సకాలంలో పుష్ప మలయాళ వెర్షన్ విడుదల చేయకుండా... అక్కడి ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. 

Also read Pushpa movie review: పుష్ప ట్విట్టర్ టాక్.. పోకిరి రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్!

తెలుగు రాష్ట్రాలలో పాటు యూఎస్ లో పుష్ప రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు వెర్షన్ వరకు పుష్ప భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన జరుగగా... బన్నీ యాక్టింగ్, మేనరిజం, చిత్తూరు డైలెక్టు అద్బుతమన్న మాట వినిపిస్తుంది. 

Also read Pushpa Movie Review: 'పుష్ప' ప్రీమియర్ షో టాక్.. ఫారెస్ట్ లో అల్లు అర్జున్ చెడుగుడు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు