RRR Movie: సిక్స్ ప్యాక్‌లో రామ్‌చరణ్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌.. ఈ రేంజ్‌లో ఉంటే ఫ్యాన్స్ కి పండగే

Published : Dec 06, 2021, 04:29 PM IST
RRR Movie: సిక్స్ ప్యాక్‌లో  రామ్‌చరణ్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌.. ఈ రేంజ్‌లో ఉంటే ఫ్యాన్స్ కి పండగే

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, మేకింగ్ వీడియో అంచనాలను పెంచేస్తే, ఇప్పుడు కొత్త లుక్స్ అదరగొడుతున్నాయి. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి రామ్‌చరణ్‌ లుక్‌ని విడుదల చేశారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా సందడి ప్రారంభమైంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమా అప్‌డేట్లతో కనువిందు చేస్తుంది యూనిట్‌. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, మేకింగ్ వీడియో అంచనాలను పెంచేస్తే, ఇప్పుడు కొత్త లుక్స్ అదరగొడుతున్నాయి. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి రామ్‌చరణ్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఉక్కుబాడీని తలపించేలా రామ్‌చరణ్‌ లుక్‌ అదరహో అనిపిస్తుంది. సిక్స్ ప్యాక్‌లో మైండ్‌ బ్లో చేస్తున్నారు చరణ్‌. అల్లూరి సీతారామరాజుని ఆయన వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. 

షర్ట్ తీసేసి సిక్స్ ప్యాక్‌లో కోపంగా అరుస్తున్నారు చరణ్‌. మెడలో ఓంకారం బిల్లా, జంద్యం, పోలీస్‌ బెల్ట్ తో అదరగొడుతున్నారు. ఆయన పాత్రలోని ఆవేశాన్ని ఆవిష్కరించేలా ఉందీ పోస్టర్‌ అని చెప్పొచ్చు. ఈ సోమవారం మార్నింగ్‌ కొమురంభీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌ని విడుదల చేశారు. రక్తం కారుతుండగా, ఉక్కు బాడీని తలపించేలా ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ చేస్తే, రామ్‌చరణ్‌ లుక్‌ సైతం మరింతగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్  పండగ చేసుకునేలా చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్‌ అప్‌డేట్లతో `ఆర్‌ఆర్‌ఆర్‌` అభిమానులకు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి అదిరిపోయేలా సర్‌ప్రైజ్‌లిస్తున్నారు `ఆర్‌ఆర్‌ఆర్‌` మేకర్స్. 

ఇక అందరు `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 9న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ట్రైలర్‌కి ముందు ఇలా సడెన్‌ సర్‌ప్రైజ్‌లతో ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది యూనిట్‌. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు పదికిపైగా భాషల్లో సినిమాని విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయబోతున్నారు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడిగా బ్రిటీష్‌ నటి `ఒలివియా మోర్రీస్‌, చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ భామ అలియాభట్‌ నటిస్తుంది. అజయ్ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విదేశీ నటులు అలిసన్‌ డూడీ, రే స్టీవెన్సన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌ సోల్‌ ఆంథెమ్‌` విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. సినిమా కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

also read: RRR Movie: రక్తపు మరకలు, ఉక్కు కండలతో ఎన్టీఆర్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌