EMK: పూరి జగన్నాధ్ స్టైల్ లో 'సర్కారు వారి పాట'.. మహేష్ భలే సంగతి చెప్పాడే

pratap reddy   | Asianet News
Published : Dec 06, 2021, 04:22 PM IST
EMK: పూరి జగన్నాధ్ స్టైల్ లో 'సర్కారు వారి పాట'.. మహేష్ భలే సంగతి చెప్పాడే

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu) షోకి హాజరయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu) షోకి హాజరయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ప్రారంభ ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్స్ లో సమంత, కొరటాల శివ- రాజమౌళి, తమన్ - దేవిశ్రీ లాంటి వారు హాజరయ్యారు. 

ఆదివారం ముగిసిన ఎపిసోడ్ లో Mahesh Babu ఎన్టీఆర్ తో కలసి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. ఎన్టీఆర్ అప్పుడప్పుడూ మహేష్ ని టెన్షన్ పెట్టే ప్రయత్నం చేశాడు. మహేష్ కూడా NTR కి సరదాగానే బదులిచ్చాడు. ఎన్టీఆర్ మహేష్ కి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తూనే మధ్యలో వెకేషన్స్ కి వెళ్లడం, సినిమాలు ఇలా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నారు. 

సర్కారు వారి పాట చిత్రం గురించి ఏమైనా చెప్పాలి అని ఎన్టీఆర్ మహేష్ ని అడిగాడు. దీనితో మహేష్ సర్కారు వారి పాట చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేశారు. సర్కారు వారి పాటలో పూరి జగన్నాధ్ ఫ్లేవర్ ఉంటుంది. పూరి మేయింగ్ స్టైల్, ఎసెన్స్ ఈ చిత్రంలో కనిపిస్తాయి. పరుశురాం ఈ చిత్రాన్ని చాలా బాగా వర్కౌట్ చేస్తున్నాడు. నేను ఇలాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ చేసి చాలా కాలం అవుతోంది అని మహేష్ తెలిపాడు. 

Also Read: Unstoppable With NBK: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై హాట్ కామెంట్స్.. బోయపాటి ముందే బాలయ్య కంటతడి

ఇక సర్కారు వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి రెడీ అయ్యే లోపు మహేష్ మరో చిత్రం చేస్తాడా లేక జక్కన్న కోసం వెయిట్ చేస్తాడా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మహేష్ కోసం త్రివిక్రమ్ కూడా ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌