ప్లాఫ్ అని ముందు తెలియదా? నయనతారపై నిర్మాత ఘాటు విమర్శలు

Surya Prakash   | Asianet News
Published : Dec 06, 2021, 03:17 PM IST
ప్లాఫ్ అని ముందు తెలియదా? నయనతారపై నిర్మాత ఘాటు విమర్శలు

సారాంశం

ఆమె నటించిన ఏ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కు అదేవిధంగా ఆ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలకు ఆమె రాదు. ఈ విషయమై ఆమెకు అదనపు పారితోషికం ఇస్తాము అన్నా ఆమె పట్టించుకోదు. 

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నయనతారకు ఇచ్చినంతగా రెమ్యునరేషన్ మరి ఏటాప్ హీరోయిన్ కు ఇవ్వరనే సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమెతో సినిమా సైన్ చేసేముందు కండిషన్స్ ను అన్నింటిని ఆమెతో సినిమాలు చేసే నిర్మాతలతో పాటు హీరోలు కూడ ఒప్పుకుని తీరాలి. నయనతార సూపర్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగిపోయిన తరువాత ఆమె ఎక్స్ పోజింగ్ సీన్స్ కు ఒప్పుకోకపోవడమే కాకుండా లిప్ లాక్ సీన్స్ ను కూడ చేయటం లేదు. అంతేకాదు ఆమె నటించిన ఏ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కు అదేవిధంగా ఆ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలకు ఆమె రాదు. ఈ విషయమై ఆమెకు అదనపు పారితోషికం ఇస్తాము అన్నా ఆమె పట్టించుకోదు. ఈ విషయమై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి తమిళ స్టార్ నిర్మాత విమర్శ చేసారు.

  నిర్మాత, నటుడు కె.రాజన్‌ ఘాటుగా ఆమెను విమర్శించారు. జీఎన్‌ఏ ఫిలిమ్స్‌ పతాకంపై జయరాజ్‌ ఆర్‌. వినాయక సునీల్‌ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్‌ మా'. షిజన్‌ లాల్‌ ఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. 

ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్‌ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్‌లో ఒక్క కేరవాన్‌ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్‌ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్‌ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు. అయితే హీరోయిన్ పేరు ఎత్తకపోయినా నయనతార అని అందరికీ అర్దమైంది. ఎందుకంటే గతంలో కూడా ఆమెపై ఇదే నిర్మాత డైరక్టర్ గా విమర్శలు చేసారు.
 

PREV
click me!

Recommended Stories

SPB Ilaiyaraaja: ఈ పాట రికార్డింగ్‌ అయ్యాక ఇళయరాజాను ముద్దుపెట్టుకున్న ఎస్పీబాలు.. అసలేం జరిగిందంటే
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?