Ram Movie Update : మళ్ళీ మొదలెట్టబోతున్న రామ్.. ఇస్మార్ శంకర్ ను మించి ఉంటుందట

Published : Jan 01, 2022, 12:59 PM ISTUpdated : Jan 01, 2022, 01:00 PM IST
Ram Movie Update : మళ్ళీ మొదలెట్టబోతున్న రామ్.. ఇస్మార్ శంకర్ ను మించి ఉంటుందట

సారాంశం

 మొన్నటి వరకూ కామ్ గా ఉన్న రామ్ పోతినేని కొత్త ఏడాది స్పీడ్ పెంచబోతున్నాడు. లింగు స్వామి సినిమాను పరుగులు పెట్టించబోతున్నాడు. నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడో అనౌన్స్ చేశాడు.

టాలీవుడ్ యంగ్  హీరో రామ్ పోతినేని లింగు స్వామి డైరెక్షన్ లో చేస్తున్నా సినిమా షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రకటించాడు. కెరీర్ లో 19 వ సినిమా చేస్తున్న రామ్.. ఈ సినిమాను ఎంతో ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాడు మల్టీ లాగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా టైటిల్ డిసైడ్ అవ్వడని ఈమూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింద. కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న మూవీకి ఆ మధ్య బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు రామ్.

 

ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు రామ్. ఇక నుంచి షూటింగ్ పరుగులు పెట్టిస్తామన్నాడు. ఆడియన్స్ కు న్యూ ఇయర్ విషెష్ చెపుతూనే..  ఈమూవీ తాజా షెడ్యూల్  ను ఈనెల 5 నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. దీనికి సంబధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్.  ఇస్మార్ట్ శంకర్ తరువాత మరో మాస్ కంటెంట్ తో రామ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.

Also Read :Chiranjeevi Bhola Shankar : భళా... భోళా శంకర్.. ఫస్ట్ లుక్ తో రఫ్ ఆడించిన మెగాస్టార్..

తమిళ డైరెక్టర్ లింగు స్వామికి మాస్ డైరెక్టర్ గా అక్కడ మంచి పేరు ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లను ఆయన బాగా హ్యాండీల్ చేయగలడు. రామ్ తో ఎటువంటి కథ తెరకెక్కిస్తున్నారో ఇంత వరకూ చిన్న లీక్ లేకుండా చూసుకున్నాడు డైరెక్టర్. తమిళంలో ఆయన ఇంతకుముందు సూర్య .. కార్తి .. విశాల్ .. విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. అవన్నీ మాస్ కంటెంట్ తో చేసిన సినిమాలే. మరి రామ్ కు మాస్ ఇమేజ్ ఇచ్చిన స్మార్ట్ శంకర్ ను మించి ఈ సినిమా ఉంటుందా..? రామ్ ను లింగు స్వామి ఎలా చూపించబోతున్నారు..? ఏంటీ.. అనేది ముందు ముందు చూడాలి. రెడ్ మూవీ ఫెయిల్యూర్ తో రామ్ ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా