రాంచరణ్ ని తొలిసారి టీవీలో చూసిన క్లీంకార, ఆ పాత్రలో కనిపించగానే రియాక్షన్ చూడండి.. గూస్ బంప్స్

By tirumala AN  |  First Published Jan 4, 2025, 4:03 PM IST

రాంచరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులు అయ్యారు. పెళ్ళైన తర్వాత పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన పండంటి పాపకి జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లీంకార అని పేరు పెట్టారు. 


మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో 6 రోజుల్లో గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం ఇదే. డైరెక్టర్ శంకర్ కి ఈ చిత్రం చాలా కీలకం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది గ్రాండ్ విజువల్స్ ఉండే భారీ స్థాయి చిత్రం కాదు. శంకర్ స్టైల్ లో సాగే పొలిటికల్ డ్రామా. ఇటీవల శంకర్ ఫామ్ దృష్ట్యా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. 

బుడిబుడి అడుగులు వేస్తున్న క్లీంకార 

రాంచరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులు అయ్యారు. పెళ్ళైన తర్వాత పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన పండంటి పాపకి జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లీంకార అని పేరు పెట్టారు. ప్రస్తుతం క్లింకార బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో అల్లరి చేస్తోంది. అప్పుడప్పుడూ క్లీంకార దృశ్యాలని రాంచరణ్, ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 

టీవీలో రాంచరణ్ ని గుర్తు పట్టిన క్లీంకార

Latest Videos

క్లీంకార తొలిసారి తన తండ్రి రాంచరణ్ ని టివిలో చూసి గుర్తు పట్టింది. ఆ విజువల్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ వీడియో టీవీలో ప్లే అవుతుండగా రాంచరణ్ కనిపించారు. తండ్రిని చూసిన వెంటనే క్లీంకార టివికి దగ్గరగా వెళ్లి వేలు చూపిస్తూ సైగలు చేసింది. 

Klinkaara excited to see her naana on TV for the first time. ❤️❤️❤️❤️❤️ sooo proud of u.
Eagerly waiting for game changer. ❤️ pic.twitter.com/C8v9Qrv6FP

— Upasana Konidela (@upasanakonidela)

అదే విధంగా రాంచరణ్ రామరాజు గెటప్ లో కాషాయ వస్త్రాల్లో కనిపించినప్పుడు కూడా క్లీంకార తన తండ్రిని గుర్తుపట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఎవరది చెప్పు అంటూ అడిగే ప్రయత్నం చేశారు. టివిలో తండ్రిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్లీంకార. రామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించగానే క్లీంకార ఇచ్చిన రియాక్షన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఉపాసన పోస్ట్ 

క్లీంకార వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం టివిలో చూసి చాలా ఎగ్జైట్ అయింది. రాంచరణ్ ని చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్ ఛేంజర్ కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. 

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రంలో చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. స్టూడెంట్ గా, ఐఏఎస్ అధికారిగా, ప్రజా నాయకుడిగా ఈలా చాలా గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. లుంగీ గెటప్ లో కూడా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ నటిస్తున్న అప్పన్న పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Also Read :బాలీవుడ్ హీరోయిన్ కి ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు, ముద్దు సీన్ తో రచ్చ.. డైరెక్టర్ కి ముఖం మీదే చెప్పేశాడు

పొలిటికల్ థ్రిల్లర్, సందేశాత్మక చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. కానీ శంకర్ గత చిత్రాల రిజల్ట్స్ మెగా అభిమానులని కలవరపెట్టేలా ఉన్నాయి. జనవరి 10న ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 చిత్రంలో నటిస్తున్నారు. ఇది పక్కాగా పాన్ ఇండియా స్థాయి ఉన్న కథ అంటూ అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. 

Also Read : జస్ట్ 50 వేలతో మొదలు, వందల కోట్లకి పడగెత్తిన కమెడియన్ అలీ.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఆస్తులు

 

click me!