థియేటర్లో ఇంకా `దేవర` హంగామా..`పుష్ప 2`ని తట్టుకుని ఆరు సెంటర్లలో వంద రోజులు, ఎక్కడెక్కడ అంటే?

By Aithagoni Raju  |  First Published Jan 4, 2025, 1:28 PM IST

ఎన్టీఆర్‌ గతేడాది `దేవర` చిత్రంతో వచ్చాడు. బాక్సాఫీసు వద్ద రచ్చ చేశాడు. ఈ మూవీ ఇంకా థియేటర్లలో హంగామా చేస్తుంది.ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. 
 


ఎన్టీఆర్‌ నటించిన లేటెస్ట్ సెన్సేషన్‌ `దేవర`. కొరటాల శివ రూపొందించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 27న విడుదలైంది. ఈ మూవీ ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా బాగానే ఆదరణ పొందింది. నార్త్ ఇండియాలో బాగా రన్‌ అయ్యింది. ఐదు వందలకుపైగా కలెక్షన్లని సాధించింది. 

నార్త్ ఇండియాలో `దేవర` రచ్చ..

యాక్షన్‌ మూవీ కావడంతో ఇది తెలుగు, సౌత్‌ ఆడియెన్స్ కంటే నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అక్కడ దుమ్మురేపింది. అయితే ఈ మూవీ ఇంకా థియేటర్లలో ఆడుతుంది. ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది.

Latest Videos

ఆరు సెంటర్లలో ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. `పుష్ప 2` వంటి సునామీని తట్టుకుని నిలబడటం మరో విశేషం. మరి ఆ ఆరు సెంటర్లు ఏంటి? అనేది చూస్తే, 

6సెంట్లలో `దేవర` వంద రోజులు..

ఈస్ట్ గోదావరిలో రెండు థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. `మలికిపురంలోని పద్మజ కాంప్లెక్స్ లో, మండపేటలోని రాజరత్న కాంప్లెక్స్ లో, గుంటూరులో సీహెచ్‌ పేటలో రామకృష్ణ థియేటర్లో,

అలాగే చిత్తూరులో  బి కొత్త కోటలో ద్వారకా పిక్చర్స్ ప్యాలెస్‌లో, కల్లూర్‌లో ఎంఎన్‌ఆర్‌లో, రొంపిచెర్లలో ఎంఎం డీలక్స్ లో `దేవర` సినిమా విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. అయితే కంటిన్యూ ఆటతో రెండు సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుందట.

read more: జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్‌? అన్‌స్టాపబుల్‌ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?

`పుష్ప 2` సునామీని తట్టుకుని..

మొత్తంగా డివైడ్‌ టాక్‌తోనూ ఈ మూవీ ఇన్ని రోజులు ప్రదర్శించడం విశేషం. దీనికితోడు `పుష్ప 2` బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. దానికోసం ఆల్మోస్ట్ అన్ని థియేటర్లని ఆక్యూపై చేసిన నేపథ్యంలో దాన్ని కాదని `దేవర`ని ఆడించడం విశేషం.

అది ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే `దేవర` ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ ఫ్లిక్స్ లో సందడి చేస్తుంది. అయినా థియేటర్‌లో రన్‌ కావడం గొప్ప విషయం. 

జులై లో `దేవర 2`..

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన `దేవర` చిత్రంలో ఆయనకు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ ఇది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌రోల్‌ చేశారు. ఆయనకు కూడా ఇది తొలి తెలుగు మూవీ. శ్రీకాంత్‌, ప్రకాష్‌ రాజ్‌, అజయ్ ముఖ్యపాత్రలు పోషించారు.

మరాఠి నటి శృతి మరాఠే పెద్ద ఎన్టీఆర్‌కి జంటగా నటించింది. దీనికి పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారట కొరటాల శివ. ఈ ఏడాది జులైలో ఇది పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. 

`వార్‌ 2`, ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో ఎన్టీఆర్‌ బిజీ..

ప్రస్తుతం ఎన్టీఆర్‌ `వార్‌ 2` షూటింగ్‌లో ఉన్నారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న స్పై యాక్షన్‌ మూవీ ఇది. యష్‌ రాజ్‌ ఫిల్మ్ నుంచి వస్తుంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర నెగటివ్‌గా ఉంటుందని తెలుస్తుంది.

దీంతోపాటు తారక్‌.. ప్రశాంత్‌ నీల్‌ తో సినిమా చేస్తున్నారు. ఇది ఆ మధ్యనే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో `దేవర 2` షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం. 

read  more: `ఎన్టీఆర్‌` బయోపిక్‌కి ముందు విద్యా బాలన్‌ నటించాల్సిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? స్టార్‌ హీరోతో ఛాన్స్ మిస్‌

aldo read: జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్‌? అన్‌స్టాపబుల్‌ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?
 

click me!