మహిళలపై దాడి చేసేవారిని నేనైతే చంపేస్తా-రకుల్

Published : Feb 22, 2017, 06:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
మహిళలపై దాడి చేసేవారిని నేనైతే చంపేస్తా-రకుల్

సారాంశం

విన్నర్ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న రకుల్ స్పెషల్ చిట్ చాట్

విన్నర్ లో మీ పాత్ర గురించి వివరిస్తారా...

విన్నర్ సినిమాలో నా పాత్ర పేరు సితార. సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు సిద్ధూ. ఈ చిత్రంలో నాది మంచి ఫిట్ నెస్ ఉన్న పాత్ర. నేను పోషించిన పాత్రకు ఓ గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం ప్రయత్నిస్తుంటుంది. దేన్ని పట్టించుకోదు. ప్రేమ అంటూ వెంటపడే హీరోను పని పాటా లేదా అని మందలిస్తుంటుంది.

 

మలినేని గోపిచంద్‌తో పనిచేయడం ఎలా అనిపించింది...

పండగ చేస్కో చిత్రం తర్వాత దర్శకుడు మలినేని గోపిచంద్‌తో నటిస్తున్న రెండో చిత్రమిది. ఇదివరకే ఆయనతో పనిచేయడం వల్ల ఈ చిత్రం చేయడం చాలా ఈజీ అయింది. ఈ చిత్రం కోసం గోపిచంద్ చాలా కష్టపడ్డాడు. ఆయన వర్కింగ్ స్టైల్ అర్థమవుతుంది. అతడు చాలా నైస్ పర్సన్. ట్రీట్ మెంట్ బాగా ఉంటుంది.

విన్నర్ లో హార్స్ రైడింగ్ చేశారా...

హార్స్ రైడింగ్ ఈ చిత్రంలో చేయలేదు. నాకు హార్స్ రైడింగ్ వచ్చు. ఈ చిత్రంలో అంతగా స్కోప్ లేదు. నాకు రాణి లక్ష్మీభాయ్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అవకాశం వస్తే చేస్తాను.

సినిమాటోగ్రఫర్ చోటా కే.నాయుడు గురించి...

చోటా కే నాయుడు కూతురిలా చూసుకొన్నాడు. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుతో పనిచేయడం కూడా ఇది రెండోసారి. నా మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌లో కలిసి పనిచేశాను. ఆ సమయంలో నేను చాలా యంగ్. తెలుగు కూడా రాదు. ఆ సమయంలో ఆయన కూతురిలా చూసుకొన్నాడు. ఆ తర్వాత దాదాపు పదకొండు సినిమాల తర్వాత కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన నన్ను చూసి బాగా తయారయ్యావు. ముదిరిపోయావు అని ఆటపట్టించాడు.

హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది...

మూడు వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారడం వల్ల పెద్దగా తేడాలేదు. దాని వల్ల వచ్చే క్రేజ్‌ను తలకు ఎక్కించుకోవడం వల్ల లాభం లేదు. కథ నచ్చిందా.. సినిమా చేశానా అనేది నాకు ముఖ్యం. సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా పట్టించుకోను. ఒక్కోసారి నచ్చిన సినిమా ఫెయిల్ అయితే ఆ రోజంతా బాధపడుతాను. బ్రహ్మోత్సవంలో అలానే జరిగింది. ఓ తమిళ సినిమా కూడా విషయంలో కూడా అలానే జరిగింది. వాటన్నింటి గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు సరికాదు.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా..

ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాను. మార్చిలో ప్రారంభమవుతుంది. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. సూర్యతో కూడా ఓ చిత్రం చేయవచ్చు. ఇంకా ఆ ప్రాసెస్ పూర్తి కాలేదు. ఈ చిత్రానికి అంగీకారం తెలిపిన తర్వాత వివరాలు చెప్తాను. మహేశ్‌బాబు సినిమా హై కాన్సెప్ట్ కథ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్ర హై కాన్సెప్ట్ మూవీ. చాలా ఇంటెలిజెంట్ చిత్రం. ఈ చిత్రంలో చాలా ఫన్నీగా ఉంటుంది. లుక్ కూడా బాగుంటుంది. ఈ చిత్రంలో కళ్లజోడు పెట్టుకొని ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తాను. మహేశ్‌బాబు సూపర్ పంక్చువల్ మహేశ్ బాబుతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేశ్ బాబు సూపర్ పంక్చువల్. తమిళ, తెలుగు వెర్షన్ రూపొందుతుండటం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. ఒకే సిన్ రెండు భాషల్లో నటించాల్సి ఉంటుంది. పాత్ర పట్ల చాలా ఇంట్రెస్ట్ తీసుకొంటాడు. పాత్రను మెరుగు పరుచడానికి మహేశ్ దర్శకుడితో కలిసి చర్చిస్తుంటాడు. ఇంకా షూటింగ్ అవుతున్నది. నా మేరకు 50 శాతం పూర్తయింది.

 

మీకు ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం...

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉంది. కానీ అలాంటి చిత్రాలు నా వద్దకు ఇంకా రాలేదు. తమిళంలో నయనతార చేస్తున్నదంటే.. అంతకుముందు ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆమె చిత్రానికి ఓపెనింగ్స్ బాగా ఉంటాయి. నయనతారకు ఓ సినిమా భారాన్ని పూర్తిస్థాయిలో మోసే సామర్థ్య ఉంది. నాకు అలాంటి కెపాసిటీ ప్రస్తుతం లేదు. నేను ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉంది.

నాగచైతన్యతో సినిమా చేస్తున్నారు. అందులో మీ కేరక్టర్ ఎలా ఉంటుంది...

చైతూతో చేసే సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలి, లవ్ స్టోరి. ఆ చిత్రంలో నాది ఇన్నోసెంట్ ఊరి అమ్మాయి పాత్ర. హీరోయిన్లకు బాగా నచ్చే పాత్ర అది. హిందీ చిత్రం జబ్ వీ మెట్ చిత్రంలో కరీనా చేసిన పాత్ర లాంటిది.

కొందరు సౌందర్యతో మిమ్మల్ని పోల్చడం ఎలా అనిపిస్తుంది...

ప్రముఖ నటి సౌందర్యతో పోల్చడం ప్రముఖ నటి సౌందర్యతో పోల్చడం మంచి కాంప్లిమెంట్. ఆమె గొప్ప నటి. కొన్ని హిట్ చిత్రాల్లో నటించడం వల్ల అలాంటి హోదా ఇప్పుడే సరిపోదు.

జిమ్ వ్యాపారం ఎలా నడుస్తోంది...

హైదరాబాద్‌లో జిమ్ ప్రారంభించి ఏడాది పూర్తయింది. జిమ్ బిజినెస్ విస్తరించే ప్లాన్స్ ఉన్నాయి. వైజాగ్‌లో జిమ్ ఫ్రాంచైజిని ఏర్పాటుచేస్తున్నాం. ఆ పనులను నా బ్రదర్ చూసుకొంటున్నాడు. వైజాగ్‌కు హైదరాబాద్‌కు తిరుగుతున్నాడు.

మీకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు..

నాకు హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు. సినీ పరిశ్రమలో సాయి ధరమ్ తేజ్, రెజీనా, రాశీఖన్నా, సందీప్, రానా, రవితేజ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. హీరోలు, హీరోలందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. నిర్మాతగా మారాలనే ఆలోచన.. చాలా రోజులుగా నిర్మాతగా మారాలనే ఆలోచన మైండ్‌లో ఉంది. బిజినెస్ ప్లాన్స్ చేయాలని ఉంది. అయితే నిర్మాతగా మారవద్దు. సినిమాలు ప్రొడ్యూస్ చేయవద్దు. ట్రై చేయకు. ఆలోచించకు అని బెదరిస్తుంటారు. చాలా మంది హెచ్చరిస్తుంటారు.

మలయాళ నటి భావనపై దాడి ఘటన పట్ల మీ స్పందన ఏంటి...

మలయాళ నటి భావనపై దాడి ఘటనపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. మా మదర్ ఎప్పుడూ జాగ్రత్తలు చెప్తుంటుంది. రాత్రిపూట ట్రావెల్ చేయవద్దని హెచ్చరిస్తుంటుంది. అయితే నేను సెలబ్రిటీని. నన్ను ఎవరైనా టచ్ చేస్తే న్యూస్ అవుతుంది అనే భావన ఉండేది. నాతో అలా ప్రవర్తిస్తే చంపేస్తాను. లాగి పెట్టి కొడ్తాను అనుకునేదాన్ని. సిమ్లాలో అలాంటి సంఘటన ఎదురైంది. నా ఫొటోలు తీస్తున్న వ్యక్తిని రోడ్డుపైనే కొట్టాను. తిరిగి వాళ్లు కూడా నాపై దాడి చేశారు. ఆ ఘటన తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. అసలు మహిళలపై వేధింపులకు, లైంగిక దాడి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. మరో ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?