
నట సామ్రాట్ పుత్రుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తాజా పరిణామాల పట్ల తీవ్రంగా కుమిలిపోతున్నారు. ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద పేలవంగా పర్ ఫామెన్స్ ఇస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా కలెక్షన్లే దీనికి కారణం అనుకుంటే పొరపాటు. సినిమా కలెక్షన్లకన్నా అమల,నాగార్జునల కుమారుడు అఖిల్ వివాహం డైలమా లో పడినందుకు నాగార్జున తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారట
గతకొన్ని రోజులుగా నాగార్జున ఇంటిపట్టునే ఉంటున్నారు. ఎవరితోనూ కనీసం ఫోన్ లో కూడా మాట్లాడకుండా... ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా పెద్దగా ఇవ్వకుండా నాగార్జున తనలో తానే మధనపడుతూ ఇంట్లోనే ఉన్నారు. ముఖ్యంగా అఖిల్ పరిస్థితి ఎందుకిలా అయ్యిందని బాధపడుతున్నాడట.
అసలే సినిమా హీరోగా పరిచయం చేసినా మొదటి సినిమా ఘోర పరాజయం పాలవడంతో భారీ షాక్ అనుకుంటే రెండో సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. సరే కదా అని ప్రేమకు అంగీకరిస్తే ఇప్పుడు ఇలా జరిగిందేంటా అని తెగ బాధపడుతున్నాడట నాగ్. తీవ్ర బాధలో ఉన్న నాగార్జున తన రెగ్యులర్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నాడట.
సినిమా వాళ్లకు, ఉన్న వాళ్లకూ ఇవన్నీ మామూలే కదా నాగార్జున ఎందుకంత మధన పడుతున్నాడో ఏమో.