రజనీకాంత్‌ `పెద్దన్న` హై వోల్టేజ్‌ ట్రైలర్‌ .. ఫ్యాన్స్ కి పూనకాలే..

Published : Oct 27, 2021, 08:24 PM IST
రజనీకాంత్‌ `పెద్దన్న` హై వోల్టేజ్‌ ట్రైలర్‌ .. ఫ్యాన్స్ కి పూనకాలే..

సారాంశం

ఆద్యంతం ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా `పెద్దన్న` సినిమా సాగబోతుందని తాజా ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో అన్నా, చెల్లి మధ్య అనుబంధాన్ని ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

రజనీకాంత్‌(Rajinikanth) ఫ్యాన్స్ కి పూనకాలు స్టార్ట్ అయ్యాయి. ఆయన నటిస్తున్న కొత్త సినిమా `అన్నాత్తే`(తెలుగులో `పెద్దన్న`)(Peddanna) చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆద్యంతం ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా సాగబోతుందని తాజా ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో అన్నా, చెల్లి మధ్య అనుబంధాన్ని ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజా ట్రైలర్ లో ఆ విషయాలను స్పష్టంగా చూపించారు. ట్రైలర్‌లో Rajinikanth లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఆయన చాలా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన చిత్రాల్లోకెళ్లా ఉత్సాహంగా ఇందులో నటించడం విశేషం.

Peddanna సినిమాలో రజనీకాంత్‌ వీరన్న అనే ఊరు పెద్దగా కనిపిస్తున్నారు. ఆయనకు చెల్లిగా కీర్తిసురేష్‌(Keerthy suresh) నటిస్తుండటం విశేషం. ట్రైలర్‌లో ప్రధానంగా Keerthy Suresh, రజనీకాంత్‌ మధ్య జరిగే సన్నివేశాలే కనిపిస్తున్నాయి. చెల్లిని కాపాడుకునేందుకు అన్నగా రజనీకాంత్‌ చేసే పోరాటం ప్రధానంగా సినిమా ఉంటుందనిపిస్తుంది. రజనీకి జోడిగా నయనతార(Nayanathara) నటిస్తుంది. వీరితోపాటు ఖుష్బు, మీనాలు కూడా రజనీకి లవ్‌ ఇంట్రెస్ట్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఫ్యామిలీ అంశాలు, యాక్షన్‌ ఎలిమెంట్లతో పక్కా కమర్షియల్ చిత్రంగా `పెద్దన్న` ఉండబోతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ రజనీ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ ట్రీట్‌లా ఉందని చెప్పొచ్చు. 

సన్‌ పిక్చర్స్ పతాకంపై శివ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్‌ సైతం ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇక దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. రజనీకాంత్‌ చివరిగా గతేడాది `దర్బార్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్‌ తర్వాత ఇప్పుడు `పెద్దన్న`తో రాబోతున్నారు. దీంతో సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే గత చిత్రం `దర్బార్‌` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈచిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని భావిస్తున్నారు రజనీ కాంత్. దీంతోపాటు తన అభిమాన హీరో అయిన రజనీకి ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్‌ ఇవ్వాలని దర్శకుడు శివ కుమార్‌ భావిస్తున్నారు. దీంతో సినిమాని కూడా ఓ ఫ్యాన్‌ బాయ్‌లా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. 

also read: ఇలియానా బికినీ ట్రీట్‌.. సెల్ఫీలో క్లోజ్‌గా అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న `పోకిరి` భామ..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?