కాస్ట్లీ కారులో తిరుగుతా.. స్టార్ హోటల్ లో తింటా..!

Published : Nov 07, 2018, 03:49 PM IST
కాస్ట్లీ కారులో తిరుగుతా.. స్టార్ హోటల్ లో తింటా..!

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆతురతగా ఎదురుచూస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా కొనసాగుతోన్న ఆయన నటించిన '2.0' చిత్రం ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రజినీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా రిపోర్టర్ ఇంత సింపుల్ జీవితాన్ని ఎలా గడపగలుతున్నారు..? అంటూ ప్రశ్నించగా రజినీకాంత్ చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది.

ఆయన ఏమన్నారంటే.. ''నేను తిరిగేది ఖరీదైన కార్లలో.. చెన్నైలోని ఖరీదైన ప్రాంతమైన పోయెస్ గార్డెన్ లో ఉంటాను. ఫైవ్ స్టార్ హోటల్ లో తింటాను. ఎవరండీ అంటారు దీన్ని సింపుల్ గాఉండడమని..'' అంటూ తనది సింపుల్ లైఫ్ కాదని, లగ్జరీ లైఫ్ అంటూ క్లారిటీ ఇచ్చారు.

సాధారణంగా హీరోలు లగ్జరీ లైఫ్ బతుకుతున్నా ఆ విషయాలను బహిరంగంగా చెప్పరు కానీ రజినీకాంత్ స్టైలే వేరంటూ ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. 

కమల్ హాసన్ తర్వాతే నేను.. రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?