నేనున్నా కదా.. సీనియర్ నటికి కుర్ర హీరో భరోసా!

Published : Nov 07, 2018, 03:24 PM IST
నేనున్నా కదా.. సీనియర్ నటికి కుర్ర హీరో భరోసా!

సారాంశం

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అర్జున్ కపూర్, మలైకా అరోరాల వ్యవహారం. నలభై ఏళ్ల ఈ సుందరి తన భర్త ఆర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న మలైకా విడాకుల తరువాత అర్జున్ కపూర్ తో కలిసి బహిరంగంగా తిరగడం మొదలుపెట్టింది. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కెమెరా కంట చిక్కారు. 

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అర్జున్ కపూర్, మలైకా అరోరాల వ్యవహారం. నలభై ఏళ్ల ఈ సుందరి తన భర్త ఆర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న మలైకా విడాకుల తరువాత అర్జున్ కపూర్ తో కలిసి బహిరంగంగా తిరగడం మొదలుపెట్టింది.

వీరిద్దరూ కలిసి చాలా సార్లు కెమెరా కంట చిక్కారు. బాలీవుడ్ లో జరిగే కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరవ్వడం, ఒకే కారులో ప్రయాణించడం వంటి విషయాలు వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మిలాన్ లో జరిగిన మలైకా పుట్టినరోజు వేడుకలకు అర్జున్ కపూర్ ప్రత్యేకంగా హాజరయ్యాడు. 

దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల జరిగిన ఓ షోలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్.. మలైకా ముందే ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తాజాగా ఈ జంట మరోసారి కలిసి కనిపించింది. ముంబైలో తమ స్నేహితులు ఏర్పాటు చేసిన దీపావళి పార్టీకి హాజరైన ఈ జంటను ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు.

ఈ నేపధ్యంలో మలైకా ఇబ్బంది పడింది.. అయితే అర్జున్ మాత్రం కోపం వ్యక్తం చేయకుండా చాలా కూల్ గా మలైకా చుట్టూ చేతులు వేసి ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లాడు. మలైకా కోసం అర్జున్ తన స్వభావాన్ని కూడా మార్చుకున్నాడని కథనాలను ప్రచురిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ