కథానాయకుడిగా సిద్దమైన పాటల రచయిత తనయుడు!

Published : Nov 07, 2018, 03:04 PM ISTUpdated : Nov 07, 2018, 03:10 PM IST
కథానాయకుడిగా సిద్దమైన పాటల రచయిత తనయుడు!

సారాంశం

గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్న చిత్రం పల్లెవాసి. త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ సినిమాను నిర్మిస్తున్నారు. కల్కి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 

దర్శకుడు మాట్లాడుతూ " వినాయకచవితి సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ అందరినీ ఎట్రాక్ట్ చేసేలా ఉందని ఫీడ్ బ్యాక్ లభించింది. ఆ రెస్పాన్స్ తో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది.  రాకేందు మౌళి నటన అందరి హృదయాలను కట్టిపడేస్తుంది. సందీప్ అందించిన స్వరాలకు వెన్నెల కంటి, రాకేందు మౌళిల సాహిత్యం చక్కగా కుదిరింది. 

కథలో భాగంగా వచ్చే పాటలు అందరినీ అలరిస్తాయి. ఇక వేసవి కాలంలో కుండలోని నీరంత చల్లగా..చలి కాలంలో చలి మంటంత వెచ్చగా...కరువు నేలలో పండిన వేరు శనగంత రుచిగా... తొలకరికి నెర్రలు దాచిన నేల పరిమలాంటి అనుభూతి ని 'పల్లెవాసి' కచ్చితంగా కలిగిస్తుందని చెబుతూ త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు