`పెద్దన్న`గా వస్తోన్న రజనీకాంత్‌.. `అన్నాత్తే` తెలుగు టైటిల్‌

Published : Oct 15, 2021, 11:32 AM IST
`పెద్దన్న`గా వస్తోన్న రజనీకాంత్‌.. `అన్నాత్తే` తెలుగు టైటిల్‌

సారాంశం

ఈ చిత్రం తెలుగులో కూడా రాబోతుంది. జనరల్‌గా రజనీకాంత్‌ నటించే అన్ని సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. తాజాగా `అన్నాత్తే`ని కూడా తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నారు.

రజనీకాంత్‌ హీరోగా నటించిన `అన్నాత్తే` తమిళ టీజర్‌ గురువారం విడుదలైంది. విజయదశమి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. రజనీకాంత్‌ ఇమేజ్‌ని ఎలివేట్ చేసేలా, ఆద్యంతం మాస్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్ తో సాగిన టీజర్‌ దుమ్మురేపుతుంది. రజనీ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ దసరా ట్రీట్‌ అంటున్నారు. రజనీని పవర్‌ఫుల్‌ రోల్‌లో దర్శకుడు శివ చూపించబోతున్నారని తాజా టీజర్ ని చూస్తుంటే స్పష్టమవుతుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం తెలుగులో కూడా రాబోతుంది. జనరల్‌గా rajinikanth నటించే అన్ని సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. తాజాగా annattheని కూడా తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నారు. ఏషియన్‌ సినిమా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేయబోతుంది. అయితే ఈ సినిమా తెలుగు టైటిల్‌ని ఖరారు చేశారు. `పెద్దన్న` పేరుతో సినిమాని రిలీజ్‌ చేయనున్నట్టు తెలిపారు. `అన్నాత్తే` అంటే తమిళంలో అన్నయ్య అనే అర్థం వస్తుంది. అదే అర్థంతో తెలుగులో ఈ చిత్రాన్ని peddhannaగా రిలీజ్‌ చేయబోతుండటం విశేషం. 

రజనీకాంత్‌ హీరోగా శివ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రజనీకాంత్‌ పాత్ర ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ ఆకట్టుకున్నాయి. మంచి ఫ్యామిలీ అంశాలు మేళవించిన మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో రజనీ మరింత ఎనర్జిటిక్‌గా,స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు.

related news: దుమ్ములేపుతున్న రజనీకాంత్‌ `అన్నాత్తే` టీజర్‌.. ఫ్యాన్స్ కి బెస్ట్ దసరా ట్రీట్‌..

టీజర్‌ ఆద్యంతం ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగబోతున్నట్టు తెలుస్తుంది. ఊరుపెద్దగా రజనీకాంత్‌ కనిపించబోతున్నట్టు టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ ఏజ్‌లోనూ రజనీ యాక్షన్‌ ఎపిసోడ్స్ అవలీలగా చేయడం అబ్బురపరుస్తుంది. రజనీ మార్క్ స్టయిలీష్‌ ఎపిసోడ్స్, డైలాగులు కట్టిపడేస్తున్నాయి. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రజనీ ఫ్యాన్స్ కిది పర్‌ఫెక్ట్ దసరా ట్రీట్‌ అని చెప్పొచ్చు. 

 సన్‌ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. దీపావలి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు. `దర్బార్` తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తోన్న సినిమా ఇది. `దర్బార్‌` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రం అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని కసిగా ఉన్నారు రజనీ. అందుకు తగ్గట్టుగానే అన్ని అంశాల మేళవింపుగా దీన్ని దర్శకుడు శివకుమార్‌ తెరకెక్కించారు.

also read: సమంత..`మహా` డిజాస్టర్‌ నుంచి తప్పించుకుందట.. రిజక్ట్ చేయడమే ప్లస్‌ అయ్యిందంటోన్న నెటిజన్లు
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్
Sudha Kongara: పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ మూవీ.. స్టార్ హీరో కొడుకుతో భారీ ప్లాన్ ?