పవన్‌ కళ్యాణ్‌ దసరా ట్రీట్‌ వచ్చేసింది.. `భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌లో ఇంట్రెస్టింగ్‌ విజువల్స్

Published : Oct 15, 2021, 10:48 AM IST
పవన్‌ కళ్యాణ్‌ దసరా ట్రీట్‌ వచ్చేసింది.. `భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌లో ఇంట్రెస్టింగ్‌ విజువల్స్

సారాంశం

`అంత ఇష్టం ఏందయ్యా నీకు.. ` అంటూ సాగేపాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వినసొంపుగా ఉంటూ అలరిస్తుంది. ఈ పాటని చిత్ర పాడటం విశేషం. ప్రస్తుతం పాట ట్రెండింగ్‌ అవుతుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు దసరా ట్రీట్‌ ఇచ్చేశారు. ఆయన నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని రెండో పాటని శుక్రవారం విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. గురువారం ఈ సాంగ్‌ ప్రోమోని విడుదల చేయగా, శుక్రవారం పూర్తి పాటని రిలికల్‌ వీడియోతో రిలీజ్‌ చేశారు. `అంత ఇష్టం ఏందయ్యా నీకు.. ` అంటూ సాగేపాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వినసొంపుగా ఉంటూ అలరిస్తుంది. ఈ పాటని చిత్ర పాడటం విశేషం. ప్రస్తుతం పాట ట్రెండింగ్‌ అవుతుంది. అయితే ఇందులోని విజువల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆర్ట్ వర్క్ తో వేసిన చిత్రాలు, నిత్యా మీనన్‌, పవన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 

ఈ పాటలో సినిమాలోని చాలా అంశాలను చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఓ ఫారెస్ట్ లో చిన్న గుడిసె వద్ద నిత్యా మీనన్‌, పవన్‌ టీ తాగుతూ ప్రేమ కబుర్లు చెప్పుకోవడం, బైక్‌పై వీరిద్దరు వెళ్లడం, షూటింగ్‌లో పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న పవన్‌ నవ్వులు పూయించడం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో చాలా అంశాలను టచ్‌ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం దసరాకి కూల్‌ సాంగ్‌తో అభిమానులకు బెస్ట్ ట్రీట్‌ ఇచ్చాడు పవన్‌. 

ఇక పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్నారు `భీమ్లా నాయక్‌` చిత్రంలో. పవన్‌ సరసన  నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సంయుక్త మీనన్‌ రానా సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగులు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. 

మలయాళంలో రూపొందిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌ పాత్ర గ్లింప్స్, రానా పాత్ర గ్లింప్స్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది. మిలియన్స్ వ్యూస్‌తో రికార్డులు సృష్టించాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. మరోవైపు రానా డేనియల్‌ శేఖర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈగోలు దెబ్బతిన్న ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. 

also read: పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్