అనుష్క చాలా భయంకరంగా వుందంటున్న రాజమౌళి

Published : Nov 07, 2017, 08:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
అనుష్క చాలా భయంకరంగా వుందంటున్న రాజమౌళి

సారాంశం

అనుష్క భాగమతి ఫస్ట్ లుక్ పై రాజమౌళి స్పందన భయంకరంగా వుందంటూ ట్వీట్ చేసిన జక్కన్న యువీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన భాగమతి  

బాహుబలి చిత్రాల తర్వాత అనుష్క పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి ప్రభంజనంలో కొన్ని బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయనే వార్తలు కూడా వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభాస్‌తో అఫైర్, పెళ్లి అంటూ మీడియాలో కథనాలు గందరగోళానికి దారి తీసాయి. ఆ తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్‌తో నటించే అవకాశం చేజారింది. తాజాగా అనుష్క చేతిలో ఉన్న ఒకే చిత్రం భాగమతి. నవంబర్ 7వ తేదీని పురస్కరించుకొని భాగమతి ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌పై విశేష స్పందన వ్యక్తమవుతున్నది.

 

ఈ ఫస్ట్ లుక్ గురించి ఎస్ ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భాగమతి చిత్రం ఫస్ట్‌ లుక్‌ మతిపోయేలా ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలుపుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. టెర్రిఫిక్ భాగమతి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

 

భాగమతి ఫస్ట్‌ లుక్‌లో అనుష్క అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఒక చేతిలో రక్తం మరకలతో కూడిన సుత్తిని పట్టుకొని, మరో చేతికి గాయం కావడంతో కారుతున్న రక్తం భయంకరంగా ఉన్నాయి. ఈ ఫస్ట్‌ లుక్‌తో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గతంలో కంటే భాగమతి ఫస్ట్‌ లుక్‌లో అనుష్క చాలా సన్నగా కనిపించారు. లావుగా ఉండటం కారణంగా భారీగా ఖర్చు చేసి గ్రాఫిక్స్ ఉపయోగించారు అనే ప్రచారం జరిగింది. అయితే అనుష్క నాజుక్కుగా కనపడటానికి గ్రాఫిక్స్ కారణమా లేక నిజంగానే సన్నపడిందా అనే వాదన వినిపిస్తున్నది.

 

భాగమతి సినిమాకు జీ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఉన్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా