డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచిన మహేష్ స్పైడర్. మించింది లేదట

Published : Nov 07, 2017, 08:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచిన మహేష్ స్పైడర్. మించింది లేదట

సారాంశం

మహేష్ బాబు మురుగదాస్  కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ దసరా కానుకగా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన స్పైడర్ స్పైడర్ పై భారీ అంచనాలు నెలకొనడంతో  అంచనాలు అందుకోక డిజాస్టర్  

సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడ‌ర్ సినిమా ద‌స‌రాకు రిలీజై ఎంత ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజైన ఈ మూవీ మ‌హేష్ కెరీర్‌లోనే రూ.130 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

 

మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా మారిన స్పైడ‌ర్.. సినిమా 40 శాతం వ‌ర‌కు న‌ష్టాల‌ను మూట‌క‌ట్టుకుంది. ఓవ‌రాల్‌గా రూ. 60 కోట్ల వ‌ర‌కు ఈ సినిమాకు న‌ష్టాలు వ‌చ్చాయి. షాక్ ఏంటంటే ఈ సినిమాకు వ‌చ్చిన న‌ష్టాలు ద‌క్షిణాదిలో ఏ సినిమాకు రాలేద‌ట‌. ఇక ఓవ‌రాల్‌గా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అత్యంత డిజాస్ట‌ర్లుగా నిలిచిన సినిమాల జాబితాలో స్పైడ‌ర్‌కు రెండో ప్లేస్ ద‌క్కింది. ఈ సినిమాను మించిన డిజాస్ట‌ర్ మ‌రోటి మూవీ మాత్రం బాలీవుడ్ లో తెరకెక్కిన రణ‌బీర్ క‌పూర్, అనురాగ్ క‌శ్య‌ప్ కాంబోలో వచ్చిన  ‘బాంబే వెల్వెట్.

 

నిజానికి తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి. దీంతో మహేష్, మురుగదాస్ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో టీజర్, ట్రైలర్ కూడా బాగా ఆకర్షించింది. దీంతో బయ్యర్లు పోటీపడి మరీ ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారు. కానీ ఈ సినిమాకు ఇండియాలోనే టాప్ డిజాస్ట‌ర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ద‌క్కింది. ఈ సినిమా నష్టాలు అరవైకోట్ల రూపాయల పైనేనట.  ఏదేమైనా మ‌హేష్ - మురుగ‌దాస్ సినిమా అన‌గానే ఎంతో ఆశిస్తే ఆ సినిమా చివ‌ర‌కు ఈ చెత్త రికార్డును మూట‌క‌ట్టుకోవ‌డం దారుణ‌మైన విష‌యం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా