
యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ గరుడవేగ. కొన్నేళ్లుగా హిట్ కోసం తపిస్తున్న రాజశేఖర్ కు కరెక్ట్ కిక్ ఇచ్చే సినిమా ఇదని చెప్పొచ్చు. సినిమాతో మరోసారి తన సత్తా చాటిన రాజశేఖర్ ఈ సినిమా సక్సెస్ అయిన సంతోషంలో ఉత్సాహంగా ఉన్నారు. ఇక సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తను చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవడంతో అతను కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.
టీజర్, ట్రైలర్ తో సినిమా మీద ఫోకస్ వచ్చేలా చేసిన దర్శకుడు సినిమాను అంతే ఎంగేజింగ్ తో నడిపించాడు. టాప్ క్లాస్ టెక్నికల్ ఎఫర్ట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో సినిమాకు సీక్వల్ గా గరుడవేగ-2 ప్లాన్ చేస్తున్నాడట ప్రవీణ్ సత్తారు.
అసలు ఏమాత్రం మార్కెట్ లేని రాజశేఖర్ తో పాతిక కోట్ల బడ్జెట్ తో సినిమా తీసిన ప్రవీణ్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సినిమా రీచబిలిటీని బట్టి ఈ కథను కొనసాగించేలా ముందే ప్లాన్ చేసుకున్నాడట ప్రవీణ్ సత్తారు. అందుకే ఇప్పుడు గరుడవేగ-2 అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు.
కథ ఇప్పటికే రెడీ అవ్వగా దీనికి సంబంధించి వెంటనే ప్రయత్నం మొదలు పెట్టాలని చూస్తున్నాడట. సినిమా అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అవడంతో ఈసారి సీక్వల్ లో మరింత టెక్నికల్ ఎఫర్ట్స్ తో సినిమా తీయాలనే ఆలోచనలో వున్నారట.