ప్రభాస్ అందుకే పెళ్లి చేసుకోవట్లేదు: రాజమౌళి

Published : Dec 24, 2018, 12:14 PM IST
ప్రభాస్ అందుకే పెళ్లి చేసుకోవట్లేదు: రాజమౌళి

సారాంశం

బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షోలో ఇటీవల ప్రభాస్, రానా, రాజమౌళిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో చర్చించారు.

బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షోలో ఇటీవల ప్రభాస్, రానా, రాజమౌళిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో చర్చించారు.

ప్రభాస్, రానాల పెళ్లి గురించి కూడా ఈ షోలో మాట్లాడారు. ప్రభాస్, రానా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని రాజమౌళిని కరణ్ ప్రశ్నించగా.. దానికి ఆయన స్పందిస్తూ.. ''ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే.. తనకి చాలా బద్ధకం. వెడ్డింగ్ కార్డ్ లు పంచడం, పెళ్లి వేడుక ఇదంతా చాలా టైమ్ తీసుకుంటుంది.

అదంతా చేయడం ప్రభాస్ వల్ల కాదు. అందుకే అతడు పెళ్లి చేసుకోవడం లేదని'' రాజమౌళి సరదాగా ఆన్సర్ చేశాడు. పోనీ ఎవరైనా అమ్మాయితో మూవ్ అవ్వొచ్చు కదా అని కరణ్ అడగ్గా.. 'ప్రభాస్ అలా చేయడని, పెళ్లి చేసుకోవడానికి మాత్రం లేజీగా ఫీల్ అవుతాడని' అన్నారు.

ఇక రానా ఓ ప్లానింగ్ ప్రకారం అన్నీ చేస్తాడని, ఏ వయసులో ఏది చేయాలో అతడికి బాగా తెలుసునని రాజమౌళి అన్నారు. 

ప్ర‌భాస్ బ‌ద్ధ‌కంపై రాజమౌళి,గెస్ట్ హౌస్ లో పార్టీ గురించి కూడా

త్రిషతో ఎఫైర్.. రానా ఏమంటున్నాడంటే..!

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?