రానా షోలో బాలయ్య హంగామా!

Published : Dec 24, 2018, 11:54 AM ISTUpdated : Dec 24, 2018, 12:02 PM IST
రానా షోలో బాలయ్య హంగామా!

సారాంశం

నందమూరి బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా రెండు భాగాలుగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది చిత్రబృందం.

నందమూరి బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా రెండు భాగాలుగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా దర్శకుడు క్రిష్ తో కలిసి బాలకృష్ణ.. రానా నిర్వహిస్తోన్న 'నెం. 1 యారీ' షోలో పాల్గొన్నాడు.

ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. రానా.. బాలయ్యని సర్ అని పిలిస్తే..''ముందు సర్ అనడం ఆపవయ్యా'' అంటూ నవ్వేశాడు బాలయ్య. ఆ తరువాత ''మీ చిన్నవయసులోకెళ్దాం..'' అంటూ రానా అంటే ''నేనిప్పటికీ చిన్నోడినే కదా.. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావ్..'' అంటూ రానాకి పంచ్ ఇచ్చాడు బాలయ్య.

''మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన క్రేజీ ఫ్యాన్స్ ఎన్కౌంటర్.. ఏంటని..?'' రానా ప్రశ్నించగా దానికి బాలయ్య నవ్వుకుంటూ.. ''ఒక్కటా..?'' అంటూ చమత్కరించాడు. ఆ తరువాత బాలయ్య గురించి క్రిష్ ని అడుగుతూ.. ''బాలకృష్ణ గారు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు.. సోషియో ఫాంటసీ, రొమాంటిక్ డ్రామా'' అని అడగగా దానికి క్రిష్ వెంటనే.. 'రొమాంటిక్ డ్రామా' అని సమాధానమిచ్చాడు.

దానికి బాలయ్య.. క్రిష్ వైపు సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లాడిలాబాలకృష్ణ ఏడుస్తూ, సింహంలా గర్జిస్తూ రకరకాల హావభావాలతో నవ్వించాడు. 

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్