చిరంజీవి సినిమా టైటిల్‌ పెట్టడంపై స్పందించిన `రాజా విక్రమార్క` డైరెక్టర్‌

By Aithagoni RajuFirst Published Nov 8, 2021, 8:22 PM IST
Highlights

చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ పెట్టాలని తమ ఉద్దేశం కాదన్నాడు `రాజా విక్రమార్క` డైరెక్టర్‌. కథకి సెట్ అయ్యే టైటిల్‌ అని, ఇది మాత్రమే సినిమా స్టోరీకి రిలేటెడ్‌ అని, ఇదే బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పారు.

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ(Kartikeya) హీరోగా నటిస్తున్న చిత్రం `రాజావిక్రమార్క`(Raja Vikramarka). నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవి చంద్రన్‌ మనవరాలు తాన్యా రవిచంద్రన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు శ్రీ సరిపల్లి స్పందించారు. ఈ సినిమాకి చిరంజీవి నటించిన `రాజా విక్రమార్క` టైటిల్‌ పెట్టడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. 

చిరంజీవి(Chiranjeevi) నటించిన సూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ పెట్టాలని తమ ఉద్దేశం కాదన్నాడు. కథకి సెట్ అయ్యే టైటిల్‌ అని, ఇది మాత్రమే సినిమా స్టోరీకి రిలేటెడ్‌ అని, ఇదే బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పారు. `Chiranjeevi టైటిల్‌ అని పెట్టలేదని, దానికి కథలో ఓ క్రెడిబులిటీ ఉండాలి కదా. అందుకు ఆలోచించి హీరో పాత్ర తీరుతెన్నులకు Raja Vikramarka సూటవుతుందనిపించింది` అని చెప్పాడు. కథ గురించి చెబుతూ, `నేను సిబిఐ కాలనీ పక్కన ఉండేవాడిని. కిటికీలోంచి చూస్తే ఓ కుర్రాడు కనిపించేవాడు. నేను అతను డ్రైవర్  లేదా చిన్న పోస్టులో పనిచేసే వ్యక్తి అయ్యి ఉంటాడని అనుకున్నా. తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణగారి బృందంలో కీలక సభ్యుడు అని తెలిసింది. నేను అనుకున్నట్టు చాలామంది అనుకుని ఉంటారు కదా! ఆ కోణంలో సన్నివేశాలు రాశా`నన్నాడు.

ఇందులో సిట్యువేషనల్ కామెడీ ఉంటుందని, సందర్భాలు చూస్తే ప్రేక్షకులకు నవ్వు వస్తుందన్నారు. ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. క్రమశిక్షణ లేకపోవడం వలన ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. 'మిషన్ ఇంపాజిబుల్' స్ఫూర్తిగా తీశానని చెప్పాడు. `మొదట హీరోగా కార్తికేయ అనుకోలేదు. కానీ 'ఆర్ఎక్స్ 100' టైమ్ లో కార్తికేయను చూశా. లుక్ సెట్ అవుతుందని అనుకున్నా. తర్వాత మేం అనుకున్న క్యారెక్టర్ లో ఉన్న టైమింగ్ అతనిలో ఉందని తెలిసింది. కథ చెప్పాను. తనకి నచ్చింది` అని తెలిపారు. అయితే ఈ సినిమాని కార్తికేయనే నిర్మించాలనుకున్నారని తెలిపారు. 

also read: Pakka Commercial Teaser: విలనిజం ఎప్పుడో చేసి చూసి వదిలేశానంటోన్న గోపీచంద్‌

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి 'రాజా విక్రమార్క` చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు శ్రీ సరిపల్లి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయడం విశేషం. చిరంజీవి హీరోగా నటించిన `రాజా విక్రమార్క` సినిమాకి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా, ఇందులోచిరు సరసన అమలా, రాధికా నటించారు. 1990లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

also read: సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

alsoread: `రాజావిక్రమార్క` ఈవెంట్‌లో కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. లవ్‌ స్టోరీ కూడా చెప్పేశాడు..

click me!