ఊహకందని భారీ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

pratap reddy   | Asianet News
Published : Nov 08, 2021, 05:52 PM IST
ఊహకందని భారీ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

సారాంశం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 10 రోజులు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం అభిమానులని వదలడం లేదు. చాలా మంది ఇంకా పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకున్నారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 10 రోజులు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం అభిమానులని వదలడం లేదు. చాలా మంది ఇంకా పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకున్నారు. అక్టోబర్ 29న పునీత్ అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో యావత్ సినీ లోకం మొత్తం విలపించింది. 

పునీత్ మరణం తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. Puneeth Rajkumar ఎంతటి గొప్ప హృదయం ఉన్న వ్యక్తో అందరికీ అర్థం అవుతోంది. పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడనే సంగతి అందరికి తెలుసు. పునీత్ స్వయంగా  26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు పునీత్ 1800 పేద విద్యార్థులకు విద్య అందించాడు. 

Also Read: డేటింగ్ యాప్ లో లారా దత్తా.. దానికి నేను వ్యతిరేకం కాదు, అంతా అసత్యం అంటూ..

మైసూరులో పునీత్ అమ్మాయిల విద్య కోసం శక్తి ధామ అనే అతిపెద్ద స్వచ్చంద సంస్థని నడుపుతున్నాడు. పునీత్ మరణంతో అందరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ పునీత్ వ్యక్తిత్వం గురించి అందరికి తెలిసింది కొంత మాత్రమే. తాను ఉన్నా లేకున్నా సేవాకార్యక్రమాలు ఆగకూడదని పునీత్ భావించాడు. 

తాజా సమాచారం మేరకు పునీత్ సేవా కార్యక్రమాల కోసం ఏకంగా రూ 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని పునీత్ గొప్ప హృదయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

పునీత్ మరణం తర్వాత సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి వెళుతూ కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. ఇటీవల సూర్య పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్, బాలయ్యలతో పునీత్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. 

Also Read: 'గద్దలకొండ గణేష్' బ్యూటీ రెడ్ హాట్ ఫోజులు.. మెస్మరైజ్ చేసే సౌందర్యం

పునీత్ చివరగా యువరత్న చిత్రంలో నటించాడు. సాయేషా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదలయింది. పునీత్ ఈ చిత్రం కోసం తెలుగులో జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్