Pakka Commercial Teaser: విలనిజం ఎప్పుడో చేసి చూసి వదిలేశానంటోన్న గోపీచంద్‌

Published : Nov 08, 2021, 07:17 PM ISTUpdated : Nov 08, 2021, 07:23 PM IST
Pakka Commercial Teaser: విలనిజం ఎప్పుడో చేసి చూసి వదిలేశానంటోన్న గోపీచంద్‌

సారాంశం

సోమవారం(నవంబర్‌ 8న) సాయంత్రం `పక్కా కమర్షియల్‌` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ఎలిమెంట్స్ తో సాగిన టీజర్‌ గోపీచంద్‌ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ మీల్స్ లాగా ఉందని చెప్పొచ్చు.

`ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం. మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేశా` అని అంటున్నారు గోపీచంద్‌(Gopichand). మ్యాచో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్‌ హీరో Gopichand ప్రస్తుతం నటిస్తున్న సినిమా `పక్కా కమర్షియల్‌` (Pakka Commercial). మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రాశీ ఖన్నా ఇందులో గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. `జిల్‌` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు `పక్కా కమర్షియల్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా సోమవారం(నవంబర్‌ 8న) సాయంత్రం Pakka Commercial) Teaserని విడుదల చేశారు. యాక్షన్‌ ఎలిమెంట్స్ తో సాగిన టీజర్‌ గోపీచంద్‌ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ మీల్స్ లాగా ఉందని చెప్పొచ్చు. అయితే క్లాసీ లుక్లో గోపీచంద్‌ అదరగొడుతున్నాడు. గతంలో మాదిరిగా ఊరమాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్ కాకుండా స్టయిలీష్‌గా కనిపించడంతోపాటు ఆయన చేసే యాక్షన్‌ ఎలిమెంట్స్ కూడా అంతే స్టయిలీష్‌గా ఉండటం విశేషం. ఇక టీజర్‌లో గోపీచంద్‌ చెప్పిన డైలాగ్‌, దానికి తగ్గట్టు యాక్షన్‌ ఎపిసోడ్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి. 

టీజర్‌లో `ఎవరికి చూపిస్తున్నారు సర్‌ మీ విలనిజం. మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేశాను` అని గోపీచంద్‌ చెప్పే డైలాగ్‌ అదిరిపోయేలా ఉంది. దీనికి మంచి స్సందన లభిస్తుంది. ఇందులో గోపీచంద్‌ చాలా కొత్తగా కనిపించబోతున్నారని అర్థమవుతుంది. ఆయన పాత్రని కూడా దర్శకుడు మారుతి చాలా కొత్తగా డిజైన్‌ చేసినట్టు టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. పూర్తి మారుతి స్టయిల్‌ మార్క్ ఇందులో కనిపిస్తుందని చెప్పొచ్చు. 

ఇటీవల `మంచి రోజులు వచ్చాయి` చిత్రంతో మంచి సక్సెస్‌ అందుకున్న మారుతి నుంచి వస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌కి మంచి స్పందన లభించింది.  సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. `భలే భలే మగాడివోయ్`, `టాక్సీవాలా`, `ప్రతి రోజు పండగే` లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో `పక్కా కమర్షియల్` సినిమా వస్తుందని యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. 

also read: Trolling: 90 ఏసినట్టున్నాడు.. బాలీవుడ్‌ యాక్టర్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

గోపీచంద్‌ ఇటీవల `సీటీమార్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈసినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లని రాబట్టింది. వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్‌కి పెద్ద రిలీఫ్‌నిచ్చింది. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. 

also read: `గని`గా మారిన అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌.. వరుణ్‌ తేజ్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది