ప్రైవేటు ఆసుప‌త్రిలో ట్రీట్మెంట్ కోరిన రాగిణి

By Surya PrakashFirst Published Oct 13, 2020, 12:20 PM IST
Highlights

  త‌న‌కు చికిత్స అందిస్తున్న‌ప్ప‌టికీ, అంత‌గా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోవ‌డంతో ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స అందించాల‌ని న్యాయ స్థానంలో పిటీష‌న్ దాఖ‌లు చేసింది.

డ్రగ్స్‌ కేసులో పరప్పన జైల్లో ఉంటున్న నటి రాగిణి ద్వివేది బాత్‌ రూమ్‌లో కిందపడి గాయపడింది. ఆమె ఆక‌స్మాత్తుగా జారి ప‌డ‌డంతో న‌డుముకు, వెన్న‌ముకకు తీవ్ర గాయ్యాల‌య్యాయ‌ట‌.జైలు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.  త‌న‌కు చికిత్స అందిస్తున్న‌ప్ప‌టికీ, అంత‌గా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోవ‌డంతో ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స అందించాల‌ని న్యాయ స్థానంలో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఇక  అదే సమయంలో కుటుంబ సభ్యులను కలవటానికి అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను న్యాయమూర్తి శీనప్ప ఆదేశించారు.  అయితే సీబీఐ న్యాయవాదులు మాత్రం పిటీషన్ తో పాటు ఎలాంటి వైద్య పత్రాలను ఎటాచ్ చేయలేదని పేర్కొంటూ అభ్యర్దనను వ్యతిరేకించారు.

ఇక  మ‌రో పిటీష‌న్‌లో రాగిణి ఇంట్లో స్వాధీనం చేసుకున్న  టాబ్లెట్ కంప్యూట‌ర్‌, పెయిన్ డ్రైవ్‌ని త‌న ఫ్యామిలీకి తిరిగి ఇచ్చేయాల‌ని చెప్పుకొచ్చారు. రాగిణీ పిటీష‌న్‌ను స్వీక‌రించిన కోర్ట్ .. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా సీసీబీ పోలీసులకు సూచించి విచారణను వాయిదా వేసింది.  ఇటీవల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించడంతో రాగిణి, సంజనలు పరప్పన  జైల్లో ఉంటున్నారు. 

రాగిణి, సంజనల విచారణలో పలు ముఖ్యమైన అంశాలను సీసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా మరికొన్ని రోజులు ఇద్దరినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. సీసీబీ విచారణలో రౌడీలు, అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహకారం అందించిన కొందరు రౌడీలపై నిఘా పెట్టారు. ఇక హైకోర్టులో బెయిలు కోసం నటీమణులు లాయర్లను సంప్రదిస్తున్నారు.

click me!