
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం. తనదైన పంథాలో సినిమాలు తీస్తూ భారీ హిట్స్ దక్కించుకున్న స్టామినా ఉన్న దర్శకుడాయన. అయితే ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బాగానే బజ్ అవుతోంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ఇటీవల ఓ కొత్త అమ్మాయి యాడ్ అయ్యారు. ఆ అమ్మాయి మరెవరో కాదు పూరీ కూతురు ‘పవిత్రా పూరీ’. పూరి తనయ పవిత్రా పూరి ఆయన తాజా చిత్రానికి సహాయ దర్శకురాలిగా చేస్తోందట.
బాలకృష్ణ, శ్రియ జంటగా పూరి తెరకెక్కిస్తోన్న బాలయ్య 101 చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. అక్కడ హెలికాపర్ట్ ఛేజ్ సీన్స్ తీస్తున్నారు. ఈ షూటింగ్‌లో డైరెక్షన్‌లో మెలకువలు తెలుసుకుంటోందట పవిత్ర. సో.. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా మెలకువలు నేర్చుకుంటున్న పవిత్ర భవిష్యత్తు లో దర్శకురాలిగా మారనుందన్న మాట.