సునీల్ ఉంగరాల రాంబాబు ఆలస్యం వెనుక బలమైన కారణం

Published : May 25, 2017, 10:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సునీల్ ఉంగరాల రాంబాబు ఆలస్యం వెనుక బలమైన కారణం

సారాంశం

కమెడియన్ గా వెండితెరకు పరిచయమై టాప్ రేంజ్ కు ఎదిగిన సునీల్ హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించిన సునీల్ సునీల్ తాజా చిత్రం ఉంగరాల రాంబాబుకు రిలీజ్ కష్టాలు?

కమెడియన్ గా వెండతెరకు పరిచయమై తర్వాత హీరోలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. అదే కోవలో తెలుగులో టాప్‌ కమెడియన్‌గా ఎదిగిన సునీల్... అదే సమయంలో హీరోగా మారాడు. మొదట్లో కొన్ని విజయాలు వరించినా, ఇప్పుడు వరుసగా పరాజయాల పాలవుతున్న సునీల్ ను పట్టించుకుంటునే వారు ఇండస్ట్రీలో బాగా తగ్గారనే చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘జక్కన్న’ కొద్దిగా ఫర్వాలేదనిపించినా.. తర్వాత వచ్చిన ‘వీడు గోల్డ్‌ ఎహే’ దారుణ పరాజయం పాలైంది.

 

సునీల్‌ ప్రస్తుతం క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో నటించాడు. క్రాంతిమాధవ్‌ ఖాతాలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హిట్‌ సినిమా ఉన్నప్పటికీ ‘ఉంగరాల రాంబాబు’ సినిమాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ వేసవిలోనే విడుదల చేద్దామనుకున్నారు. అయితే బయ్యర్లు మందుకు రాకపోవడంతో సినిమా విడుదల కష్టంగా మారింది. 

 

మరి సునీల్ సినిమా ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..