బికినీతో హాలీవుడ్ జనాన్నే పడేసింది

Published : May 25, 2017, 10:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బికినీతో హాలీవుడ్ జనాన్నే పడేసింది

సారాంశం

బేవాచ్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా బికినీ షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలిన ప్రియాంక పబ్లిసిటీ స్టెంటే... అయితే అనుకుంది సాధించింది మాజీ ప్రపంచ సుందరి

మాజీ మిస్ వాల్డ్, బాలీవుడ్ హాట్ క్వీన్ ప్రియాంక చోప్రా ఇటీవల హాలీవుడ్ లో బిజీ అయిపోయింది. తొలి సినిమాతోనే అటెన్షన్ క్రియేట్ చేసింది. తాను నటించిన బేవాచ్‌ సినిమా ప్రచారం కోసం  బీచ్‌లలో బికినీల్లో తిరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలిన ప్రియాంక చోప్రా ఆ దెబ్బతో మీడియా అటెన్షన్‌ ఫుల్‌గా రాబట్టుకుంది. గతంలో ఎన్నడూ ఇంతలా హాట్ గా కనిపించని ప్రియాంకను బికినీలో చాలా హాట్ హాట్ అందాల్లో చూసిన ఆమెఅభిమానులే కాక నెటిజన్లు అంతా తెగ ఎంజాయ్ చేశారు. అలా బేవాచ్‌ సినిమా విషయంలో మిగిలిన స్టార్‌ కాస్ట్‌ కంటే తనే హైలైట్‌ అయ్యేలా ప్రియాంక చోప్రా బడా ఎత్తుగడే వేసి సక్సెస్ అయింది ప్రియాంక.

 

తాజాగా బేవాచ్‌ చిత్రం ప్రీమియర్‌ షోస్‌ నుంచి వస్తోన్న రివ్యూస్‌లోను ప్రియాంక చోప్రాకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇందులో విక్టోరియా లీడ్స్‌ అనే విలన్‌ పాత్ర పోషించిన ప్రియాంక చోప్రా బడా హాలీవుడ్‌ స్టార్లని దాటిపోయి అంతా తానే అనే లెవెల్లో ఇమేజ్ సంపాదించింది. మొత్తానికి క్వాంటికో టెలివిజన్‌ సిరీస్‌తో  హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకకి అక్కడి పబ్లిసిటీ స్టంట్స్ బాగానే ఒంటబట్టాయి. అందుకే తన హాలీవుడ్‌ డెబ్యూ అందరూ గుర్తించేట్టు చేయడంలో మార్కెటింగ్‌ ట్రిక్స్‌ బాగా ప్లే చేసింది.

 

అంతే కాక.. క్వాంటికో కొత్త సీజన్‌ కు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ కెరియర్‌ అనుకోని విధంగా ఎక్స్‌టెండ్‌ అయింది. బేవాచ్‌ కమర్షియల్‌గాను హిట్‌ అయితే ఇక ప్రియాంక అక్కడ పాగా వేసేసినట్టే. మొత్తానికి ట్రిపులెక్స్‌ సినిమాతో దీపిక పదుకొనే సాధించలేకపోయిన ఇమేజ్ ను ప్రియాంక సాధించి చూపించింది. 

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు