Puneeth Rajkumar: పునీత్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన `జేమ్స్` సినిమా టీమ్‌

Published : Nov 01, 2021, 07:49 PM IST
Puneeth Rajkumar: పునీత్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన `జేమ్స్` సినిమా టీమ్‌

సారాంశం

Puneeth Rajkumar నటిస్తున్న `జేమ్స్` సినిమా యూనిట్‌. పునీత్‌ మరణంతో ఆయన నటించిన సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో చిత్ర దర్శక, నిర్మాతలు క్లారిటీకి వచ్చారట. 

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌(Punneth Rajkumar) హఠాన్మరణంతో ఆయన అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలో అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం వెల్లడించింది Puneeth Rajkumar నటిస్తున్న `జేమ్స్` సినిమా యూనిట్‌. పునీత్‌ మరణంతో ఆయన నటించిన సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో చిత్ర దర్శక, నిర్మాతలు క్లారిటీకి వచ్చారట. 

ప్రస్తుతం పునీత్‌ `జేమ్స్`(James), `ద్విత్వ` చిత్రాలకు కమిట్‌ అయ్యాడు. ఇందులో James చిత్రం ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. చివరి దశలో ఉంది. ఇందులో పునీత్‌.. బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారు. బాడీ బిల్డర్‌గా, కండలు తిరిగిన దేహంతో కనిపించేందుకు అతిగా వ్యాయామాలు చేశాడు పునీత్‌. ఓవర్‌గా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న క్రమంలోనే ఆయన గుండెపోటుకి గురయ్యారని అంటున్నారు. శృతి మించిన వర్కౌట్స్‌ పునీత్‌ ప్రాణాలు తీశాయని ప్రచారం జరుగుతుంది. 

దీంతో ఈ సినిమా విషయంపై అభిమానులు చాలా కోపంగా, అసంతృప్తితో ఉన్నారట. అయితే ఈ సినిమాని ఏం చేయాలో అర్థం కావడం లేదు యూనిట్‌కి. సినిమాకి దర్శకత్వం వహిస్తున్న చేతన్‌ కుమార్‌, నిర్మాత కిషోర్‌ పత్తికొండ ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారట. పునీత్‌ యాక్షన్‌ పార్ట్ మొత్తం పూర్తి కావడంతో దాదాపు 60కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే వాయిస్‌ డబ్బింగ్‌ విషయంలో ఇప్పుడు సమస్య వచ్చి పడింది. వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పిస్తే వాయిస్‌లో సహజత్వం లేక అభిమానులు మరింత నిరాశ చెందే అవకాశం ఉంది.

 దీంతో షూటింగ్‌లో పునీత్‌ చెప్పిన వాయిస్‌నే పెట్టాలనుకుంటున్నారు. అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోబోతున్నారు. దీని కోసం ఏకంగా ముంబయికి చెందిన ఓ ఐటీ కంపెనీ రంగంలోకి దిగిందట. కొత్త టెక్నాలజీతో `జేమ్స్` షూటింగ్‌ సమయంలో పునీత్‌ చెప్పిన డైలాగ్స్ క్వాలిటీ పెంచి విజువల్స్ కి సింక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఈ ప్రయత్నం సక్సెస్‌ అయితే వచ్చే ఏడాది మార్చి 17న పునీత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ వార్తతో ఇప్పుడు పునీత్‌ అభిమానులు కాస్త రిలీఫ్ అవుతున్నారట. అభిమాన నటుడి చివరి  సినిమాని చూడాలను ఆతృతగా ఉన్నారట. 

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడైన పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నడనాట పవర్‌స్టార్‌గా గుర్తింపు, పాపులారిటీ, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విశేష సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో నిలిచిపోయారు. ఆయన శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆయన్ని దగ్గర్లోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. పునీత్‌ని బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం లేదు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానులకు, ఫ్యామిలీకి, సినీ రంగానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. 

also read: పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహాన్ని ముద్దాడిన సీఎం బొమ్మై... చివరకు తల్లిదండ్రుల ఒడిలోకి చేరిన సూపర్ స్టార్

ఆయన కూతురు ధృతి అమెరికా ఉండటంతో ఆమె తండ్రిని చివరి చూపు చూసేందుకు శనివారం సాయంత్రం బెంగుళూరుకి చేరుకున్నారు. తెలుగు హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, శ్రీకాంత్‌, అలీ, నరేష్‌ వంటి వారు కూడా బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. కర్నాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను పూర్తి చేసింది. 

also read: Puneeth Rajkumar: రాజ్‌కుమార్‌ హీరోలను వెంటాడుతున్న `గుండెపోటు`.. పునీత్‌ హార్ట్ ఎటాక్‌కి కారణమదేనా?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Anasuya బట్టలపై కొడుకు కామెంట్.. సొంత కొడుకని కూడా చూడలేదు, ఇచ్చిపడేసిన మాజీ యాంకర్‌