దెయ్యంగా మారిన చిరంజీవి.. షాక్‌లో మెగాఫ్యాన్స్

Published : Nov 01, 2021, 05:28 PM ISTUpdated : Nov 01, 2021, 05:53 PM IST
దెయ్యంగా మారిన చిరంజీవి.. షాక్‌లో మెగాఫ్యాన్స్

సారాంశం

 ఘోస్ట్ గా తాను ఎలా భయపెట్టగలనో చూపించారు మెగాస్టార్‌. అందు కోసం హలోవీన్‌గా మారారు. ఘోస్ట్ లుక్లో కనిపించి షాకిచ్చారు. ప్రస్తుతం ఆయన పంచుకున్న ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రాలకు మారుపేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన పరకాయం ప్రవేశ గలరు. Chiranjeeviని నెగటివ్‌ రోల్‌లో కూడా చూసి ఉన్నారు అభిమానులు. కానీ ఘోస్ట్ గా తెరపైన కనిపించలేదు. కానీ ఘోస్ట్ గా తాను ఎలా భయపెట్టగలనో చూపించారు మెగాస్టార్‌. అందు కోసం హలోవీన్‌(Chiranjeevi turn Halloween)గా మారారు. ఘోస్ట్ లుక్లో కనిపించి షాకిచ్చారు. ప్రస్తుతం ఆయన పంచుకున్న ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇందులో ఇంగ్లీష్‌ పాటని పాడుతున్నట్టుగా ఉంది. ఇంగ్లీష్ పాటకి చిరు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ, ఘోస్ట్ లుక్‌లోకి మారడం భయపెట్టించేలా ఉంది. ఈ వీడియోని చిరు ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. దీంతో ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. అక్టోబర్‌ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా తారలు ఇలా దెయ్యం లుక్‌లోకి మారిన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. అలా మెగాస్టార్‌ కూడా తన వీడియోని పంచుకుని మెగా అభిమానులను ఖుషీ చేశారు. అయితే గతంలోనూ ఇలా ఘోస్ట్ గా కనిపించారు చిరు. కానీ ఇలా వీడియోలో భయపెట్టింది మాత్రం ఇదే ఫస్ట్ టైమ్‌ అని చెప్పొచ్చు.

చిరంజీవి రీఎంట్రీ ఎంట్రీ తర్వాత స్పీడ్‌ పెంచారు. `ఖైదీ నెంబర్‌ 150` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి కమ్‌ బ్యాక్‌ అయ్యారు. ఎనిమిదేళ్లు గ్యాప్‌ వచ్చినా తన ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తర్వాత చేసిన `సైరా నర్సింహారెడ్డి` విమర్శకులు ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే చేస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

also read: RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!

మరోవైపు మరో మూడుసినిమాలను ప్రకటించారు చిరు. మలయాళంలో హిట్‌ అయిన `లూసీఫర్‌`ని ప్రస్తుతం `గాడ్‌ఫాదర్‌`గా చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు `భోళాశంకర్‌`, అలాగే తన 154లో చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో దాదాపు మూడు సినిమాలు వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక మెగా అభిమానులు పండగే అని చెప్పొచ్చు. 

also read: బీచ్‌లో బిగ్‌బాస్‌ హారిక అందాల సయ్యాట.. చూసినోడికి దేత్తడే..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే