దివ్య భారతి తండ్రి మృతి.. కుమార్తె చనిపోయినప్పటి నుంచి చివరి నిమిషం వరకు..

pratap reddy   | Asianet News
Published : Nov 01, 2021, 05:00 PM IST
దివ్య భారతి తండ్రి మృతి.. కుమార్తె చనిపోయినప్పటి నుంచి చివరి నిమిషం వరకు..

సారాంశం

కేవలం 19 ఏళ్ల యుక్తవయసులోనే దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించింది. 90వ దశకంలో సినీ ప్రియులకు దివ్యభారతి గురించి పరిచయం అక్కర్లేదు.

కేవలం 19 ఏళ్ల యుక్తవయసులోనే దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించింది. 90వ దశకంలో సినీ ప్రియులకు దివ్యభారతి గురించి పరిచయం అక్కర్లేదు. తాజాగా దివ్య భారతి కుటుంబంలో విషాదం జరిగింది. ఆమె తండ్రి ఓమ్ ప్రకాష్ భారతి రీసెంట్ గా తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 30 శనివారం రోజు ఓం ప్రకాష్ మరణించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. 

దీనితో ఆయన అంత్యక్రియలని నిర్మాత, దర్శకుడు Divya Bharti మాజీ భర్త  Sajid Nadiadwala   జరిపించారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. దివ్య భారతి మరణించినప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల బాగోగులు సాజిద్ చూసుకుంటున్నారట. వారిద్దరిని సాజిద్ తల్లిదండ్రులతో సమానంగా చూసుకునేవారని అంటున్నారు. వయసు మీద పడడంతో అనారోగ్య కారణాల వల్ల ఓం ప్రకాష్ మరణించినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా దివ్య భారతి మరణం ఇప్పటికీ మిస్టరీనే. ప్రజల్లో ఆమె మరణంపై ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ.. దివ్య భారతి ప్రమాదం కారణంగానే మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. 19 ఏళ్ల వయసులో దివ్య భారతి తన ఇంటి బాల్కనీ నుంచి పడిపోయి మరణించింది. అప్పటికే దివ్య భారతి, సాజిద్ ల పెళ్లి జరిగింది. దీనితో సాజిద్ పై అనేక ఆరోపణలు వినిపించాయి. చిత్ర పరిశ్రమలో జరిగిన అత్యంత విషాదకర సంఘటనల్లో దివ్య భారతి మరణం ఒకటి. 

Also Read: RRR Glimpse: ఈ డీటెయిల్స్ గమనించారా.. ఆ ఒక్కటి మైండ్ బ్లోయింగ్

దివ్య భారతి సినీ ప్రస్థానం కేవలం రెండు మూడేళ్ళ పాటు మాత్రమే సాగింది. కానీ ఆమె ఇంపాక్ట్ మాత్రం చిత్ర పరిశ్రమలో సాలిడ్ గా పడింది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టగానే 'బొబ్బిలి రాజా', 'అసెంబ్లీ రౌడీ' లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. తన గ్లామర్ తో యువతని ఉర్రూతలూగించింది. కెరీర్ జోష్ మీద ఉన్న సమయంలో 1993లో దివ్య భారతి మరణించింది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే