
రియల్ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) మరణంతో యావత్ సినీలోకం మూగబోయింది. ఆయన మరణ వార్తతో విషాదంలో మునిగిపోయింది. పునీత్ లేడనే వార్తతో కన్నీరు పెడుతుంది. అద్భతమైన నటుడు, మంచి మనసున్న మనిషి, సేవకి మారుపేరైన పునీత్ ఏడంటూ అభిమానుల లోకం సైతం కన్నీరుమున్నీరవుతుంది. మొత్తంగా పునీత్ మరణం ఇప్పుడు అందరిని కలచివేస్తుంది. పవర్‌స్టార్‌గా కన్నడనాట తనకంటూ తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న Puneeth Rajkumar శుక్రవారం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
దీంతో అభిమాన హీరో భౌతికకాయాన్ని చూసేందుకు అభిమానులు కంఠీరవ స్టేడియానికి క్యూకట్టారు. కిలోమీటర్లకు క్యూ కట్టారు. మరోవైపు సెలబ్రిటీలు సైతం ఆయన భౌతికకాయాన్నిసందర్శించి నివాళ్లు అర్పిస్తున్నారు. మరోవైపు పునీత్ పెద్ద కూతురు ధృతి(Dhriti) రాకకోసం వేచి చూస్తున్నారు. ఆమె అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు. తండ్రి మరణంతో హుటాహుటిన ఆమె ఇండియా బయలు దేరారు. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో దిగిన ఆమె కారు కాన్వాయ్ ద్వారా తండ్రి భౌతిక కాయం ఉంచిన కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు.
తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యింది Dhriti. తండ్రి పార్థివ దేహాన్ని పట్టుకుని బోరున విలపించింది. పెదనాన్న శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, భార్య అశ్విని, కూతుళ్లు ధృతి, వందితా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడ ఉన్న అభిమానులను సైతం కన్నీళ్లు పెట్టించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని సైతం భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.
పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఉదయం 9గంటల సమయంలో పునీత్ ఇంట్లో జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్కి గురయ్యారు. ఆ తర్వాత వెంటనే ఆయన్ని సమీపంలోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అభిమాన, సినీ లోకాన్ని శోకసంద్రంలో, తీవ్ర విషాదంలో ముంచెత్తి వెళ్లారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానులను, కుటుంబాన్ని ఒంటరి చేసి వెళ్లాపోయారు. కానీ తన సినిమాలతో, సేవా కార్యక్రమాలతో చిరంజీవిగానే నిలిచారు. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పునీత్ తుదిశ్వాస విడిచారు.
related news: Puneeth Rajkumar: రాజ్‌కుమార్ హీరోలను వెంటాడుతున్న `గుండెపోటు`.. పునీత్ హార్ట్ ఎటాక్‌కి కారణమదేనా?
ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యుల సందర్శనార్థం పునీత్ ఇంటికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత సాయంత్రం అభిమానుల సందర్శనార్థం తండ్రి రాజ్‌కుమార్ పేరుతో గల కంఠీరవ స్టేడియానికి తరలించారు. అయితే కూతురు ధృతి అమెరికా నుంచి రాక ఆలస్యం కావడంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించడం లేదు. పైగా సూర్యస్తమయం తర్వాత కన్నడ సంప్రదాయాల ప్రకారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించకూడదనే నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో పునీత్ భౌతిక కాయానికి రేపు(ఆదివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు.
related news: Puneeth Rajkumar: భగవంతుడు పునీత్‌కి అన్యాయం చేశాడంటూ చిరంజీవి భావోద్వేగం.. వెంకీ, శ్రీకాంత్, అలీ నివాళి..