Puneeth rajkumar death: పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా

Siva Kodati |  
Published : Oct 30, 2021, 02:21 PM ISTUpdated : Oct 30, 2021, 02:24 PM IST
Puneeth rajkumar death: పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా

సారాంశం

గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు (puneeth rajkumar funeral) రేపటికి వాయిదా పడ్డాయి. కుటుంబసభ్యుల రాక ఆలస్యంతో అంత్యక్రియలు వాయిదా వేసినట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) అధికారికంగా ప్రకటించారు. 

గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు (puneeth rajkumar funeral) రేపటికి వాయిదా పడ్డాయి. కుటుంబసభ్యుల రాక ఆలస్యంతో అంత్యక్రియలు వాయిదా వేసినట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా పునీత్ కుమార్తె ధృతీ (dhriti rajkumar ) అమెరికా నుంచి ఇంకా రాకపోవడంతో అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి. 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్, అప్పు అంటూ ముద్దుగా పిలుచుకునే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై మరణించారు. 

ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన అంత్యక్రియలకు కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తన తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ కు కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాదాపు 6 వేలమంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పునీత్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. 

ALso Read:Puneeth rajkumar death: తల బాదుకుంటూ కన్నీరు మున్నీరైన బాలకృష్ణ.. పునీత్ పార్థివదేహం ముందు ఇలా

అన్ని చిత్రాల పరిశ్రమల నుంచి స్టార్ నటీనటులు.. రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు పునీత్ పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరు పయనం అవుతున్నారు. ఇక తెలుగుతో పునీత్ కు విడదీయరాని అనుబంధం ఉంది. టాలీవుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు పునీత్ కు స్నేహితులే. దశాబ్దాల కాలంగా పునీత్ ఫ్యామిలీతో మెగా, నందమూరి కుటుంబాలకు మంచి రిలేషన్ ఉంది. 

దీనితో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. ఇప్పటికే Nandamuri Balakrishna బెంగుళూరుకు బయలుదేరారు. పునీత్ కడసారి చూపు కోసం Chiranjeevi, Jr NTR ఈ మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. అలాగే నటులు నరేష్, శివ బాలాజీ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఇళయదళపతి విజయ్ కూడా పునీత్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది