కాజల్‌, సిరీలపై ప్రియా బూతు కామెంట్‌.. సంచాలకులు కన్నీళ్లు.. పవన్‌ కళ్యాణ్‌ మేనరిజంతో రెచ్చిపోయిన సన్నీ

Published : Oct 13, 2021, 11:50 PM IST
కాజల్‌, సిరీలపై ప్రియా బూతు కామెంట్‌.. సంచాలకులు కన్నీళ్లు.. పవన్‌ కళ్యాణ్‌ మేనరిజంతో రెచ్చిపోయిన సన్నీ

సారాంశం

తమకు లభించిన స్పెషల్‌ పవర్ నుంచి గ్రీన్‌ టీమ్‌ రవి వాళ్లు బ్లూ టీమ్‌ నుంచి టాయ్స్ తీసుకుంటామన్నారు. అయితే ఇది గమనించిన ఆనీ మాస్టర్‌కి కొన్నింటిని చించేసింది. ఆ తర్వాత కన్వేయర్‌ బెల్ట్‌పై నుంచి వచ్చే  రా మెటీరియల్‌ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగింది. 

బిగ్‌బాస్‌5 ఆరో వారం మిక్స్ డ్‌ గా సాగుతుంది. బుధవారం గేమ్‌ ఆసక్తికరంగా సాగింది. మంగళవారం గేమ్‌లో ఆనీ మాస్టర్‌ సిరిపై ఫైర్‌ అయ్యారు. కానీ బుధవారం ఎపిసోడ్‌లో దారుణంగా బుక్కైపోయాడు ఆనీ మాస్టర్‌కి చెందిన బ్లూ టీమ్. నిన్నటి ఎపిసోడ్‌లో రవికి సంబంధించి గ్రీన్‌ టీమ్‌కి పవర్‌ దొరికింది. దీని ప్రకారం ఇతర మూడు టీమ్‌లకు చెందిన టాయ్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రవి టీమ్‌ బ్లూ టీమ్‌ అయిన ఆనీ మాస్టర్ల టాయ్స్ ని తీసుకుంటామని తెలిపారు. 

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్‌ ఇంటి సభ్యులకు `బీబీ బొమ్మల  ఫ్యాక్టరీ` టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రెడ్‌ టీమ్‌, ఎల్లో టీమ్‌, గ్రీన్‌ టీమ్, బ్లూ టీమ్‌ అని నాలుగు టీమ్‌లుగా ఇంటి సభ్యులను విడగొట్టాడు. కాజల్‌, సిరి సంచాలకులుగా ఉంటారు. దీంతో బిగ్‌బాస్‌ కన్వేయర్‌ బెల్ట్ నుంచి టాయ్స్ కి సంబంధించి ముడి సరుకు పంపిస్తాడు. వాటిని సేకరించి బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది. అందులో బ్లూ టీమ్‌ అత్యధికంగా 11 టాయ్స్ చేశారు. 

తమకు లభించిన స్పెషల్‌ పవర్ నుంచి గ్రీన్‌ టీమ్‌ రవి వాళ్లు బ్లూ టీమ్‌ నుంచి టాయ్స్ తీసుకుంటామన్నారు. అయితే ఇది గమనించిన ఆనీ మాస్టర్‌కి కొన్నింటిని చించేసింది. ఆ తర్వాత కన్వేయర్‌ బెల్ట్‌పై నుంచి వచ్చే  రా మెటీరియల్‌ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగింది. ఇతర టీమ్‌కి ముందుగా నిల్చుని వాటిని తీసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో సన్నీ మండిపడ్డాడు. `ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ` అంటూ ఫైర్‌ అయ్యాడు. 

also read:`భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌ ప్రోమో లోడింగ్‌.. పవన్‌ కళ్యాణ్‌, నిత్యాలపై లవ్‌ సాంగ్‌..

దీంతో హర్ట్ అయిన సిరి గట్టిగానే స్పందించింది. సంచాలకులమైన తమపై అరవడాన్ని ఆమె అభ్యంతరం చెప్పింది. అందరి ముందు తనకు సారీ చెప్పాలని పట్టుపట్టింది. కానీ సన్నీ లెక్కచేయలేదు. పైగా సిరి రకరకాలుగా కామెంట్లు చేస్తూ రెచ్చగొట్టేప్రయత్నం చేశారు. `నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో` అంటూ పవన్‌ కళ్యాణ్‌ మ్యానరిజాన్ని చూపించాడు. మరో సంచాలకురాలు కాజల్ తన స్ట్రాటజీ గేమ్‌కి తెరలేపింది. మేం పెట్టిన రూల్‌ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలంటూ రూల్ పెట్టింది. ఈ విషయంలో ప్రియా విభేదించింది. దీంతో వీరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. 

`నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు` అంటూ ప్రియా గట్టిగా అనడం, దాన్ని మళ్లీ మళ్లీ రిపీట్‌ చేయడంతో సిరి కన్నీళ్లు పెట్టుకుంది. ఇలానే మాట్లాడారా? ఒక్కొక్కరు నోరు జారుతున్నారంటూ ఆవేదన చెందింది సిరి. మరోవైపు సన్నీ మాత్రం సిరిని కామెంట్‌ చేస్తూ `అటు బస్సూ.. ఇటు బస్సూ ` అనే పాట పాడాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

వెంకటేష్ రీమేక్ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేయడానికి కారణం ఏంటి? వెంకీ రీమేక్ మూవీస్ లిస్ట్ లో బ్లాక్ బస్టర్స్
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్