ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో `nani29` మూవీ.. దసరా ట్రీట్.. అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Published : Oct 13, 2021, 08:33 PM IST
ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో `nani29` మూవీ.. దసరా ట్రీట్.. అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

సారాంశం

ఇటీవల `టక్ జగదీష్‌`తో అలరించిన నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా కొత్త సినిమాని ప్రకటించారు. తన `nani29` మూవీ అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా సినిమాని ప్రారంభించబోతున్నారు.

నాని మరో కొత్త సినిమాని ప్రకటించారు. ఎస్‌ఎల్‌వీ ప్రొడక్షన్స్ లో ఆయన కొత్త సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు విజయదశమి సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తెలిపారు నాని, ఈ మేరకు ఆయన ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను శుక్రవారం మధ్యాహ్నం 1.53గంటలకు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

రైల్వే ట్రాక్‌, ఫ్యాక్టరీలు, బొగ్గు ఇలా బ్లాక్‌ షేడ్స్ తో డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆద్యంతం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అయితే ఈ సినిమా తెలంగాణలోని కొత్తగూడెం సింగరేణి కోల్‌ మైనింగ్‌ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో nani తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. nani29 సినిమాకి సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్‌ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు సమాచారం. 

also read : పవన్‌‌కి, జగన్ ప్రభుత్వంతో రాజీ చేస్తాం.. ట్యాక్సులు కట్టకపోవడం వల్లే.. నిర్మాత బన్నీ వాసు

ఇటీవల `టక్ జగదీష్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు నాని. `మజిలీ` ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. ప్రస్తుతం నాని `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్ సాంక్రిత్యాన్‌ డైరెక్షన్‌లో `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తున్నారు. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరోవైపు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికి` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళ నటి నజ్రియా నజిమ్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాల షూటింగ్‌లు దాదాపు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. దీంతో కొత్త చిత్రానికి దసరా సందర్భంగా శ్రీకారం చుట్టబోతున్నారు నాని. ఇలా సినిమాల విషయంలో జోరు పెంచారు. బ్యాక్ టూ బ్యూట్‌ ఆడియెన్స్ ని ఎంటర్టైన్‌ చేసేందుకు రాబోతున్నారు నాని. 

also read: మరో అమ్మాయితో `జబర్దస్త్` వర్షకి అడ్డంగా దొరికిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. రోజా ముందుకు పంచాయితీ.. వార్నింగ్‌
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది